*డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మించిన సినిమా “అభినవ్ ”*
*డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మించిన సినిమా “అభినవ్ ”*
“ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల చిత్రం “అభినవ్ “(chased padmavyuha). ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
*దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ* – మన సమాజానికి జాఢ్యంలా పట్టుకున్న డ్రగ్స్ భూతం విద్యార్థులనూ వదలడం లేదు. డ్రగ్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో అంతర్జాతీయ కుట్ర కోణం కూడా ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా పెరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడు అనేది ఈ చిత్రంలో చూడబోతున్నారు. తన స్నేహితులతో కలిసి అభినవ్ చేసిన సాహసాలు ఆకట్టుకుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించాను. డ్రగ్ మాఫియా మన గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా విస్తరించింది. ఎన్ సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకోవడం ద్వారానే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరు. మన దేశం ఆర్థికంగా వెనకబాటుకు పిల్లల్లో అక్షరాస్యత లేకపోవడం కూడా కారణం. పిల్లలను బాగా చదివించడం ద్వారా మన దేశాన్ని అగ్రగామిగా నిలపవచ్చు. ఇలాంటి అంశాలన్నీ అభినవ్ చిత్రంలో చూపిస్తున్నాం. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అభినవ్ చిత్రాన్ని విద్యార్థులకు చూపించడం ద్వారా వారిలో మంచి ఆలోచనలు కలిగించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. రాణి రుద్రమదేవి స్ఫూర్తితో 30 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న మంత్రి శ్రీ కొండా సురేఖ గారికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందించడం సంతోషంగా ఉంది అన్నారు.
*నటీనటులు* – సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర, తదితరులు
*టెక్నికల్ టీమ్* – కెమెరా – సామల భాస్కర్, సంగీతం – వందేమాతరం శ్రీనివాస్, ఎడిటర్ – నందమూరి హరి, పీఆర్ఓ – చందు రమేష్, సమర్పణ – శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, బ్యానర్ – సంతోష్ ఫిలిమ్స్, నిర్మాత, దర్శకత్వం – భీమగాని సుధాకర్ గౌడ్.