షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!

షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

డైరెక్టర్ ఎంజిఆర్ మాట్లాడుతూ…
బ్లడ్ రోజస్ సినిమా లో రంజిత్ రామ్, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది, కో ప్రొడ్యూసర్ ఎల్లప్ప సహకారం మరువలేనిది, నిర్మాత హరీష్ కె అభిరుచిగల ప్రొడ్యూసర్, సినిమాను రిచ్ గా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ లో నిర్మించారు. నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు హరీష్ కె గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

నిర్మాత హరీష్ కె మాట్లాడుతూ…
మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా డైరెక్టర్ ఎంజిఆర్ పరిచయం అయ్యారు, బ్లడ్ రోజస్ సినిమా బాగా వచ్చింది. మాకు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ మాట్లాడుతూ…
నిర్మాత హరీష్ కె గారు నాకు మంచి మిత్రుడు, మంచి సినిమా చెయ్యాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. బ్లడ్ రోజస్ అందరికి నచ్చే సినిమా అవుతుంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము అన్నారు.

హీరో రంజిత్ రామ్ మాట్లాడుతూ…
కర్నాటక లో నేను కొన్ని సినిమాలు చేశాను. మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవ్వాలని అనుకుంటున్న సమయంలో ఈ కథ విని వెంటనే చేశాను, కథ కథనాలు నాకు బాగా నచ్చాయి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ…
బ్లడ్ రోజస్ సినిమా నాకు కొత్త జానర్ డైరెక్టర్ ఎంజిఆర్ గారు డిఫరెంట్ కథతో ఈ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అంటుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు మా చిత్ర యూనిట్ కు కావాలని తెలిపారు.

రంజిత్ రామ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో
కీలక పాత్రలో శ్రీలు, క్రాంతి కిల్లి నటించగా,సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర , ప్రగ్యా, నవిత, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమత రెడ్డి, జ్యోతి, ఆచార్యలు తదితరులు నటించారు. దర్శకుడు ఎంజిఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా చిత్రీకరణ చేశారు.

బ్లడ్ రోజస్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది, ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రసాద్ ల్యాబ్ లో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరామెన్ ఒగి రెడ్డి శివకుమార్ సంగీతం పెద్దపల్లి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. ఈ చిత్రం దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.

ఫైట్ మాస్టర్ నందు మాట్లాడుతూ…
ఈ సినిమాకు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశాను. డైరెక్టర్ గారు, నిర్మాత గారు సినిమాను మంచిగా చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా లో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు.

ఈ సినిమాలో నటించిన అందరూ నటీనటులు పాజిటీవ్ గా ఉన్నారు. సినిమా విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు.

నటీనటులు:
రంజిత్ రామ్, అప్సర రాణి హీరో హీరోయిన్లు గా నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, శ్రీలు, క్రాంతి కిల్లి, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర, ప్రగ్యా, నవిత జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమత రెడ్డి, జ్యోతి, ఆచార్యలు,బేబీ అనూష, బేబీ శ్రీయ, బేబీ గౌతమి తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: టిబీఆర్ సినీ క్రియేషన్స్
సమర్పణ: కె,నాగన్న మరియు కె,లక్ష్మమ్మ నిర్మాత: హరీష్ కె
కో ప్రొడ్యూసర్: ఎల్లప్ప
రచన, దర్శకత్వం: ఎంజిఆర్
సంగీతం: పెద్దపల్లి రోహిత్ (పిఆర్)
ఎడిటర్: రవితేజ సిహెచ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికుమార్
కెమెరామెన్: ఓగిరెడ్డి శివ కుమార్
డిఐ: సంజీవ్ మామిడి
సౌండ్ ఎఫెక్ట్: శ్రీను నాగపూరి
కాస్ట్యూమ్ డిజైనర్: గీతిక మందాటి
ఫైట్: నందు, హుసేన్, రాజేష్ లంక
పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్తే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *