డిఫరెంట్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!
వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ లో జి. ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డిఫరెంట్. ఎన్.ఎస్.వి.డి శంకరరావు నిర్మాతగా డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో లియోన్ ఆర్ భాస్కర్ కెమెరామెన్ గా చేస్తున్నా ఈ సినిమాకు నిహల్ సంగీతం అందించారు. ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 18 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ: న్యూజిలాండ్ లో వరుసగా హత్యలు జరుగుతు ఉంటాయి.. చనిపోయినవారు అందరు అమ్మాయిలే..
సిటీ లో ఒక సైకో తిరుగుతున్నాడు జాగ్రత్త ఉండాలి అని న్యూస్ లో చెప్తుంటారు.. పోలీస్ అధికారులు సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు..
ఇంతలో హీరో బాబ్ ( నితిన్ నాష్) ఒక్కడే ఉంటాడు.. అదే ఇంట్లో బాబ్ అమ్మ సన ఒక రూమ్ లో లాక్ చేసుకొని ఉంటుంది.. ఒక ముగ్గురు అమ్మాయిలు బాబ్ ఇంట్లోకి చొరబడి బాబ్ నీ చంపుదాం అని చూస్తారు..
అసలు బాబ్ ఒక్కడే ఎందుకు ఉంటాడు.. వల్ల అమ్మ రూమ్ లో ఎందుకు ఉంటుంది.. ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు… సిటీ లో హత్యలు చేసేది ఎవరు అనేదే కథ
విశ్లేషణ: హీరో నితిన్ పెర్ఫెమెన్స్ సినిమాకి హైలైట్ ఇంట్లో ఒంటరి గా ఉంటే ఎలా ఉంటుందో ఆ భయాన్ని తన నటనలో చూపించాడు.. అమ్మ గా సన నటన అలాగే ముగ్గురు అమ్మాయిలు అందరూ బాగా నటించారు. వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు
ఒక్కటే ఇంట్లో సినిమా మొత్తం తీసి మెప్పించడం అంటే మాములు విషయం కాదు… నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే స్క్రీన్ప్లే తో బాగా చూపించాడు డైరెక్టర్
కెమెరా వర్క్ బాగుంది, మంచి లైటింగ్స్ లో సినిమాను గుడ్ విజువల్స్ తో తెరకెక్కించారు. ఎడిటర్ ఎడిటింగ్ బాగుంది, సినిమాను ఎక్కువ లెన్త్ లేకుండా బాగా కట్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది..
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం డ్రాగన్ ఉదయ్ భాస్కర్ ఆయన టేకింగ్ చాలా బాగుంది, సినిమాను ఎక్కడా బోరింగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు.
ఒక డిఫరెంట్ కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిఫరెంట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక మంచి సినిమాను అందించిన చిత్ర యూనిట్ కు అభినందనలు. మంచి సినిమాను ప్రేక్షకులు మిస్ అవ్వదు డిఫరెంట్ మూవీ అందరు చూడదగ్గ సినిమా.
రేటింగ్: 3/5