తెలుగు

*జూన్‌లో ‘దీక్ష’ చిత్రం విడుదలకు సన్నాహాలు*

By admin

May 12, 2025

*జూన్‌లో ‘దీక్ష’ చిత్రం విడుదలకు సన్నాహాలు*

ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్‌ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్‌ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..‘‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. అలాగే మైథలాజికల్ ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు. మా చిత్రం ద్వారా హీరో కిరణ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్ లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్టింది. మా చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో దీక్షతో పనిచేసారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన 5 పాటలు అందించారు. మధుప్రియ తదితర ముఖ్య గాయనీ గాయకులు తమ స్వరాన్ని అందించారు. ఆర్ ఆర్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రం లో 5ఫైట్స్ ఉన్నాయి. రోహిత్ శర్మను విలన్ క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తీసుకొస్తుంది. మా బ్యానర్ లో రాబోతున్న 41వ చిత్రమిది. చాలా పట్టుదలతో తీశాం. ప్రేక్షకుల సపోర్ట్ మాకు అందుతుందని భావిస్తున్నాం. దీని తర్వాత ‘కబడ్డీ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ..‘‘ఆర్‌‌కే గౌడ్ గారు ఎంతోమంది కొత్త నటీనటులను ఎంకరేజ్ చేశారు. అందులో నేను కూడా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన డైరెక్షన్‌లో హీరోగా నటించడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా ప్యాషనేట్‌గా వర్క్‌గా చేశారు. ‘దీక్ష’ టైటిల్‌కు తగ్గట్టే.. అందరూ చాలా కష్టపడ్డారు. దీంతో పాటు తర్వాతి సినిమాలోనూ నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు”అని అన్నారు.

నటి ఆక్సఖాన్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ స్టార్టింగ్‌ నుంచి నాకు సపోర్ట్‌గా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇందులో మంచి పాత్రను పోషించాను. హీరో కిరణ్ గారితో పాటు నా తోటి నటీనటులందరూ బాగా నటించారు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. మా చిత్రాన్ని ప్రేక్షకులందరు చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను’’ అన్నారు.

నటి తులసి మాట్లాడుతూ దీక్ష సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. అవకాశం ఇచ్చిన దర్శకులు ఆర్కే గౌడ్ గారికి కృతజ్ఞతలు అన్నారు.

నటుడు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఆర్ కె గౌడ్ గారు దీక్ష మూవీ లో విలన్ రోల్ ఇచ్చారు. చాలా అద్భుతంగా వచ్చింది మూవీ. ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ సహా చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.