తెలుగు

ఈ నెల 13న వస్తోన్న నిజం

By admin

June 11, 2025

ఈ నెల 13న వస్తోన్న నిజం

హరి ఓం కనెక్ట్స్ పతాకం పై రామ్స్ కట్ సమర్పణ లో సాయికుమార్, పోసాని కృష్ణ మురళీ, నాగబాబు ప్రధాన పాత్రల్లో కిశోర్ వెన్నెలకంటి దర్శకత్వంలో జానకి రామారావు పామరాజు నిర్మించిన చిత్రం ” నిజం”. ఈ చిత్రం ఈ నెల 13న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత జానకి రామారావు పామరాజు మాట్లాడుతూ…”దర్శకుడు కిషోర్ వెన్నెలకంటి గారు ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయి కుమార్, పోసాని , నాగబాబు గారి పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయి. అలాగే మ్యూజిక్ తో పాటు స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ నెల 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తాం “అన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు: కిషోర్ వెన్నెలకంటి; నిర్మాత: జానకి రామారావు పామరాజు ; సంగీతం: సి. కృష్ణ; పాటలు: సురేశ్ గంగుల; కెమెరా: జీవి ప్రసాద్; ఎడిటర్: జేపీ; PRO: రమేష్ చందు.