*జూలైలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “దీక్ష” సినిమా*
ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్య రెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్సా ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “దీక్ష”. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలైలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో
*దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* – మా “ఆర్కే దీక్ష” సినిమాకు సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్, రీ రికార్డింగ్ పూర్తి అయ్యాయి. జూలై మొదటి వారంలో మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి జూలై నెలాఖరుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. ప్రతి మనిషికి దీక్ష అనేది అవసరం. ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడిగా నాకు ఇది 8వ సినిమా. నిర్మాతగా 50 చిత్రాలకు చేరువవుతున్నాను. “దీక్ష” సినిమా నాతో పాటు మా హీరో కిరణ్, హీరోయిన్ అక్సాఖాన్ ఇతర టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. మధుప్రియ మూడు పాటలు పాడింది. మొత్తం సినిమాలో ఐదు హిట్ సాంగ్స్ ఉన్నాయి. హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఇందులో హీరోయిన్ ను కాపాడే సీన్ లో భీముడి పాత్రలో ఆయన చెప్పిన లెంగ్తీ డైలాగ్ హైలైట్ అవుతుంది. అలాగే అక్సాఖాన్ తన నటనతో పాటు ఈ చిత్రంలో ఓ అదిరిపోయే పాట చేసింది. ఈ పాటలో ఆమె డ్యాన్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి రోహిత్ శర్మ అనే ఒక విలన్ ను తీసుకున్నాం. అతని విలన్ గా ఫెరోషియస్ గా నటించాడు. తులసి మరో కీ రోల్ చేసింది. మా మరో ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి కూడా ఈ మూవీ పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ సినిమా కంప్లీట్ చేశాక మహిళా కబడ్డీ అనే చిత్రాన్ని రూపొందించబోతున్నాం. “ఆర్కే దీక్ష” సినిమాను మీరంతా ఆదరిస్తారని, మా టీమ్ కు మంచి గుర్తింపు అందిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.
*హీరో కిరణ్ మాట్లాడుతూ* – ” దీక్ష” చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. టైటిల్ కు తగినట్లే ఆర్కే గౌడ్ గారు ఈ చిత్రాన్ని ఒక దీక్షతో చేస్తున్నారు. ఆయన తన పట్టుదల వల్లే టీఎఫ్ సీసీ ఛైర్మన్ గా తెలంగాణ సినిమా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ అక్సాఖాన్ బాగా నటించింది. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, ఫైట్ మాస్టర్ రవితో పాటు మా డీవోపీ..ఇలా ప్రతి టెక్నీషియన్ కష్టపడి పనిచేశారు. నాకు నటనే జీవితం. ఎప్పుడూ సినిమా ఆలోచనే ఉంటుంది. ఆర్కే గౌడ్ గారికి మూవీ మేకింగ్ లో పక్కా ప్లానింగ్ ఉంటుంది. ఏ రోజు అనుకున్న సీన్స్ ఆ రోజు తీసేవారు. అందరం పంక్చువల్ గా పనిచేశాం. “ఆర్కే దీక్ష” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. మా టీఎఫ్ సీసీ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనుకుంటున్నాం. నెక్ట్స్ మూవీ మహిళా కబడ్డీలో కూడా కీ రోల్ చేస్తున్నా అన్నారు.
*హీరోయిన్ ఆక్సాఖాన్ మాట్లాడుతూ* – ” దీక్ష” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. ఆయన సపోర్ట్ ను మర్చిపోలేను. హీరో కిరణ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న కిరణ్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నేనొక స్పెషల్ సాంగ్ చేశాను. ఆ పాటలో సాంగ్స్ మీకు బాగా నచ్చుతాయి. తులసీ చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ” దీక్ష” సినిమా కోసం ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎంతో కష్టపడి పనిచేశారు. నన్ను ఢీ షో నుంచి ఎలా ఆదరించారో…ఈ సినిమాతోనూ అలాంటి సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఈ చిత్రాన్ని ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో పి. అశోక్ కుమార్, ఆర్ కె గౌడ్ నిర్మించారు.