ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కోసం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్ రావు, గొటేటి మోహన్ తదితరులు సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులు గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్,ప్రభు ,అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ ఈ జనార్దన్ రెడ్డి, మరో ఉపాదక్షులుగా యం డి అబ్దుల్, ప్రదాన కార్యదర్శి గా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీమతి పర్వీన్ , భాగవతుల మురళి కోశాధికారిగా,చదలవాడ
భరద్వాజ, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సి నెంబర్స్ గా గిరిధర్ ,నరసింహ,సాయిరమేష్, RDS ప్రకాష్, నవీన్,గోరంట్ల రవి, అప్పాజీ శ్యామ్, చందు రమేష్, టి కేశవాచారి తదితరులు ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ గౌరవా అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ 1969 లో ఏర్పాటు అయిన ఈ అసోసియేషన్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన చరిత్ర ఉంది.ఇంత చరిత్ర కలిగిన అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటి కలను నిజం చేయటానికి ముందుకువచ్చి న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు గారికి అసోసియేషన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాం. క్రిటిక్స్ ను అణగదొక్కాలి అని కొందరు చేసిన ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొన్నాం.. స్వర్గస్తులైన నా శ్రీమతి ఆడెపు దుర్గా మాధవి జ్ఞాపకార్ధం 50 వేలు క్రిటిక్స్ కు విరాళంగా ఇస్తున్నాను అని ప్రకటించారు.
అధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ నేను మహానగర్ ఈవినింగ్ ఎడిషన్ లో 500 జీతంతో సినిమా జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించాను.ఆ సమయంలో ప్రముఖ సినిమా పి ఆర్ ఓ గిరిధర్ గారు అస్తెంట్ పి ఆర్ ఓ గా మరో 500 వేతనం నాకు ఇచ్చారు. ఆ రోజుల్లో గిరిధర్ గారు నన్ను చదలవాడ శ్రీనివాసరావు గార్కి పరిచయం చేశారు. ఈ రోజు నేను చదలవాడ శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యుడు గా మారాను. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల అందరిని చదలవాడ శ్రీనివాసరావు గారు తమ ఇంటి పెద్దకొడుకులు గా భావిస్తున్నారు. ఆ ప్రేమతోనే వారు అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటి కలను నిజంచేసేందుకు ముందుకు వచ్చినందుకు వారికి అసోసియేషన్ అధ్యక్షులుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రోజుల్లో 300 కోట్ల ఆస్తిని సభ్యులకు ఇచ్చేందుకు ముందుకు రావటం శ్రీనివాసరావు గారి పెద్ద మనస్సుకు నిదర్శనం వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు .గతంలో సెక్రెటరీ గా పనిచేశాను.ఇప్పుడు అధ్యక్షులుగా అవకాశం కల్పించిన సభ్యులు అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
ప్రదాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ నేను కృష్ణా పత్రికలో పని చేస్తున్న సమయం నుండి ఈ క్రిటిక్స్ అసోసియేషన్ అంటే అభిమానం. ఈ అసోసియేషన్ సీనియర్స్ రాసిన ఎన్నో వ్యాసాలు కటింగ్స్ దాచుకున్నాను.వార్తలో ఉద్యోగం వచ్చాక బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నేను ఈ అసోసియేషన్ నెంబర్ అయ్యాను.గతంలో ఈ అసోసియేషన్ కు నేను రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశాను.ఇప్పుడు కార్యదర్శి గా ఎన్నుకున్నారు. గతంలో కరోనా సమయంలో అసోసియేషన్ తరుపున ఫండ్ రేజ్ చేసి సభ్యులకు ఆర్థిక సహాయం చేశాం.అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కు కృషి చేస్తాను.ఈ అసోసియేషన్ సభ్యులను స్వంత నిధులతో స్వంత ఇల్లు కల్పించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాసరావు గార్కి కృతజ్ఞతలు అన్నారు.
సీనియర్ సభ్యులు బాలి రెడ్డిగారు మాట్లాడుతూ ఎంతో పేదవారు అయిన అసోసియేషన్ సభ్యుల స్వంత ఇంటి కలను నిజం చేసేందుకు ముందుకు వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారి పెద్ద మనస్సుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా ఈ రోజు అసోసియేషన్ కళ కళ లాడటానికి చదలవాడ శ్రీనివాసరావు గారి చొరవే కారణం అన్నారు. ఇంకా ఈ సమావేశంలో సీనియర్ సభ్యులు లక్ష్మణరావు , మామిడి గిరిధర్, సాయి రమేష్,భాగవతుల మురళి, తదితరులు ప్రసంగించారు. ఎండి అబ్దుల్ వందన సమర్పణ తో సమావేశం ముగిసింది.