తెలుగు

ఘనంగా “వ్యూ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 20న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

By admin

November 18, 2026

*ఘనంగా “వ్యూ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 20న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ*

పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “వ్యూ”. ఈ సినిమాకు ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రంజిత్, సోనియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్టర్ కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర, ప్రచుర కాంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ పై సత్య చౌదరి నిర్మిస్తున్నారు. మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 20న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటి సోనియా మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ఎన్నో ఆడిషన్స్ కు వెళ్లాను. మంచి అవకాశం కోసం చూస్తున్న టైమ్ లో “వ్యూ” సినిమాలో ఆఫర్ దక్కింది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. ఒక మంచి క్యారెక్టర్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని నమ్ముతున్నా. చిత్ర పరిశ్రమలో కెరీర్ ఎంచుకునేందుకు నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ కు థ్యాంక్స్. మా వ్యూ మూవీని ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ – “వ్యూ” సినిమా నాకు ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో నటించే క్రమంలో డైరెక్టర్ మహేశ్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ తో నా క్యారెక్టర్ ను బాగా పర్ ఫార్మ్ చేశానని నమ్ముతున్నాను. కొత్త తరహా కంటెంట్ తో మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకునేలా మా సినిమా ఉండబోతోంది. ఈ నెల 20న థియేటర్స్ కు వెళ్లి మా సినిమా చూడాలని కోరుతున్నా. అన్నారు.

హీరోయిన్ పూజా రెడ్డి మాట్లాడుతూ – “వ్యూ” సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇలాంటి స్ట్రాంగ్ రోల్ నాకు కెరీర్ ప్రారంభంలోనే దక్కడం సంతోషంగా ఉంది. ఈ క్యారెక్టర్ లో నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ట్రైలర్ లో ఎంత ఎనర్జీ ఉందో మీరు చూశారు. సినిమాలోనూ అంతే ఎనర్జీ ఉంటుంది. మా మూవీ సక్సెస్ మీట్ లో మరింత మాట్లాడుతాను. అన్నారు.

ప్రొడ్యూసర్ సత్య చౌదరి మాట్లాడుతూ – నేను ఈ సినిమా చేసి ప్రొడ్యూసర్ గా మీ ముందు ఉన్నానంటే కారణం మా డైరెక్టర్ మహేశ్. ప్రతి క్రాఫ్ట్ ను ఆయనే దగ్గరుండి చూసుకుంటా మంచి సినిమా చేశాడు. మా బాపిరాజు గారు సినిమాను రిలీజ్ చేసేందుకు రావడం సంతోషంగా ఉంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ప్రచుర కంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ నాకు సపోర్ట్ గా నిలిచాయి. నన్ను ఆదరించింది కళామతల్లి. ఆ తల్లి ఆదరణకు కృతజ్ఞతగా ఒక మంచి ఫీమేల్ ఒరియెంటెడ్ మూవీ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ ఫ్యామిలీతో కలిసి మా సినిమాను చూడండి. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ – ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు విజయవంతంగా కొనసాగుతోంది. చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. డబ్బింగ్ చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టే వ్యూ చిత్రాన్ని మేము రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా చూసిన వారు వందమందికి బాగుందని చెబుతారు. అంటే ఒక టికెట్ కొన్న వాళ్లు వందమందితో టికెట్ కొనేలా చెబుతారు. దర్శకుడు మహేశ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇద్దరూ ఉన్నారు. ఆయనతో నేను ఒక మూవీ చేయాలనుకుంటున్నా. మా సినిమాను ఈ నెల 20న థియేటర్స్ లో చూడండి. అన్నారు.

డైరెక్టర్ మహేశ్ కాంపెల్లి మాట్లాడుతూ – ఈ కథ మా ప్రొడ్యూసర్ గారికి చెబితే ఆయనకు నచ్చి నా దగ్గరున్న బడ్జెట్ ఇది అన్నారు. ఇది చాలు అని చెప్పి సినిమా స్టార్ట్ చేశాం. నేను ఎవరి దగ్గరా దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినిమా మీద ఉన్న ప్యాషన్ తో సాధ్యమైనంత బెస్ట్ టెక్నీషియన్స్ ను తీసుకున్నాను. ప్రతి ఒక్కరికీ ఒక వ్యూ ఉంటుంది. ఈ కథ నా వ్యూ పాయింట్ లో నుంచి చెప్పింది. ఒక మంచి సినిమా చేశానని మాత్రం గర్వంగా చెప్పగలను. నా సినిమాలన్నీ మనం నిజంగా చూసినట్లు, మన ఇంట్లో, పొరుగింట్లో జరిగినట్లు ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటి ఫీల్ ను కలిగిస్తుంది. నేను డైరెక్టర్ గా కంటే ఒక మంచి స్టోరీ టెల్లర్ గా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

నటీనటులు – పూజా రెడ్డి, ప్రదీప్, సోనియా, తదితరులు

టెక్నీషియన్స్ ———————— ఎడిటర్ – లక్ష్మి డీవోపీ – ధర్మ జి.జి లిరిక్స్ – మహేశ్ కాంపెల్లి బీజీఎం – శరవణ మ్యూజిక్ – అర్జున్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – లక్ష్మి నారాయణ రిలీజ్ – శ్రీ లక్ష్మి పిక్చర్స్ (బాపిరాజు) ప్రొడ్యూసర్ – సత్య చౌదరి స్క్రిప్ట్, డైరెక్షన్ – మహేశ్ కాంపెల్లి