సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్  కొత్త‌చిత్రం 

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్  కొత్త‌చిత్రం
కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు. భారీ హిట్ చిత్రాల‌కు కేరాఫ్ అయిన శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను ప్రాధాన్య‌మిచ్చే సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్‌ బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్‌ను శుక్రవారం విడుద‌ల చేశారు.
ఈ పోస్ట‌ర్‌లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహ‌స్ప‌తిః సింహరాశౌ స్థిత న‌మ‌యే, అంతిమ పుష్క‌రే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు ష‌ట్‌చ‌క్రంలో ఓ క‌న్ను చూపిస్తున్నారు. అస‌లు ఈ క‌న్ను, ష‌ట్‌చ‌క్రం, సంస్కృత వాక్యం వెనకున్న క‌థేంట‌నే అంశాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. మిస్టీక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రచన శాఖ‌లో ప‌నిచేసిన కార్తీక్ దండు తెర‌కెక్కిస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వరలో తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *