ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 5న ఆయన కరోనా పాజిటివ్‌తో హాస్పటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం శ్వాస సమస్య నుంచి కూడా ఆయన కోలుకున్నట్లుగా హాస్పటల్ వర్గాలు గురువారం హెల్త్ బులెటిను విడుదల చేశాయి. అయితే గురువారం అర్థరాత్రి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో.. వెంటనే ఆయనని ఐసీయూకి తరలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *