రిలీజ్ కు రెడీ అవుతున్న హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ‘సీతాయణం’

రిలీజ్ కు రెడీ అవుతున్న హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ‘సీతాయణం’
కన్నడ సుప్రీమ్‌ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరో గా గ్రాండ్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అక్షిత్ శ‌శికుమార్ తొలి చిత్రం `సీతాయ‌ణం` తెలుగు, కన్నడ భాషలలో రూపొందింది. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి ముస్తాబు చేస్తున్నారు.

`సీతాయ‌ణం` చిత్రాన్ని రోహన్ భరద్వాజ్ సమర్పిస్తున్నారు.  కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై లలితా రాజ్యలక్షి నిర్మిస్తున్నారు.  ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహిస్తున్నారు. అనహిత భూషణ్ హీరోయిన్‌గా నటించారు.

తెలుగు, కన్నడలో పాటు, తమిళంలో డబ్బింగ్ చేసి, అన్నీభాష‌ల్లోనూ ఒకే రోజున విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అందులో భాగంగా తమిళ డబ్బింగ్ , రీ రికార్డింగ్ పనులను పూర్తి చేసుకుని డి.టి.యస్ ఫైనల్ మిక్సింగ్ కార్యకలాపాలను ప్రసాద్ ల్యాబ్ లో శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ” సీతాయణం చిత్రీకరణలో ఏ దశలోనూ రాజీ పడకుండా తెరకెక్కించాం. 63 రోజుల పాటు బ్యాంకాక్, బెంగళూర్, మంగళూర్, హైదరాబాద్, వైజాగ్, అగుంబే ప్రాంతాలలో షూటింగ్ జరిపాం. ‘రెస్పెక్ట్ ఉమెన్’ అన్న ట్యాగ్ లైన్ కి ఖచ్చితమైన జస్టిఫికేషన్ ఇచ్చేలా ఉంటుంది. ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ వారసుడిగా వస్తున్న సంగీత దర్శకుడు పద్మనాభ్ భరద్వాజ్ మంచి మెలోడీ గీతాలని అందించారు, చిత్రంలోని 5 పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలో ప్రముఖుల చేతులమీదుగా టీజర్, ట్రైలర్ లను విడుదల చేయిస్తాం” అన్నారు.

దర్శకడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ, “నిర్మాతల పూర్తి సహకారంతో, నటీ నటుల అద్భుతమైన ప్రదర్శనతో అనుకున్నది అనుకున్న‌ట్టుగా మా సీతాయణం తెరకెక్కిస్తున్నాం. నేటి తరానికి నచ్చేలా, హృద్యమైన అంశాలు, సన్నివేశాలతో… సున్నితమైన భావాలకు అద్దం పడుతూ తెర‌కెక్కించాం. ఓ జంట‌ ప్రేమాయణంలో ఏర్ప‌డిన సమస్య ఎటువంటి టర్న్ తీసుకుంది? దీని పర్యవసానం ఏంటి ? హీరో పోరాటం చివరికి ఎలాంటి ఫలితాన్ని చూస్తుంది? అనేది క‌థాంశం. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న మా చిత్రం త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది.  ఈ చిత్రంలో పద్మనాభ్ భరద్వాజ్ అందించిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి, కొన్ని దశాబ్ధాలుగా తెలుగు వారి పెళ్లి శుభలేఖ పై ఉండే ఓ శ్లోకాన్ని తొలిసారిగా పాటరూపంలో తీసుకువస్తున్నాం. మరో విశేషం ఏంటంటే… ఈ చిత్రంలో ఒక పాటలోని బ్రీత్ లెస్ చరణాలను కన్నడ , తెలుగు భాషలలో ప్రముఖ గాయని శ్వేతా మోహన్ పాడగా తమిళంలో దళపతి విజయ్ కజిన్ పల్లవి సురేందర్ గానం చేసారు, ఈ పాట మూడు భాషల శ్రోతలను విశేషంగా అక్కట్టుకుంటుంది” అన్నారు.

తారాగణం:
అజయ్ ఘోష్, విద్యుల్లేఖ‌ రామన్, మధునంద‌న్, బిత్తిరి సత్తి, విక్రమ్ శర్మ,  హితేష్ శెట్టి, గుండు సుదర్శన్, కృష్ణ భగవాన్, జబర్దస్త్ అప్పారావు, అనంత్,  బేబీ త్రియేక్ష, ఐ కె త్రినాథ్, మధుమణి, షర్మిత గౌడ, మేఘన గౌడ  తదితరులు.

రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక
కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: అనీష్
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *