టిక్‌టాక్ ఔట్: అంద‌రి చూపు ‘హైస్టార్’ వైపు!

టిక్‌టాక్ ఔట్: అంద‌రి చూపు ‘హైస్టార్’ వైపు!

◆ టిక్‌టాక్ స్థానంలో ‘హైస్టార్’ యాప్
◆ ఇండియా-అమెరికా కేంద్రాలుగా యాప్
◆ రెండు దేశాల్లో భారీ మార్కెట్ దిశ‌గా అడుగులు
◆ షార్ట్ వీడియో యాప్ ట్రెండ్‌లో కొత్త టెక్నాల‌జీ
◆ ఏఐ టెక్నాల‌జీతో ‘హైస్టార్’ యాప్
◆ 3 సెక‌న్‌ల నుంచి 60 సెక‌న్‌ల వ‌ర‌కు వీడియోలు
◆ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వ‌చ్చిన‌ యాప్‌
◆ పాపులారిటీ వ‌చ్చిన‌వారికి ‘హైస్టార్‌’‌గా ప్ర‌త్యేక‌ గుర్తింపు
◆ ప‌లు కంపెనీల‌కు అడ్వ‌ర్టైజ్‌మెంట్‌లు చేసే అవ‌కాశం
◆ డైలాగ్, కామెడీ, డాన్స్‌, మ్యూజిక్.. మ‌రెన్నో ఫీచ‌ర్స్‌

టిక్‌టాక్ బ్యాన్ కావ‌డంతో షార్ట్ వీడియో ల‌వ‌ర్స్‌.. అలాంటి కిక్ ఇచ్చే యాప్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి రెండు మూడు యాప్‌లు వ‌చ్చినా ఆ మ‌జా ఇవ్వ‌లేక‌పోయాయి. ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు రంగంలోకి దిగింది హైస్టార్ యాప్. హైద‌రాబాద్‌కు చెందిన ప‌బ్బాస్ ఇన్నోవేష‌న్ రూపొందించిన ఈ యాప్ ఇండియా-అమెరికా కేంద్రాలుగా కొన‌సాగనుంది. చైనాకు చెందిన టిక్‌టాక్ అమెరికాలోనూ బ్యాన్ అవుతుండ‌టంతో ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు ‘హైస్టార్’ యాప్ భారీ ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. భార‌త్‌, అమెరికా దేశాల్లో మార్కెట్‌ను విస్త‌రించుకుంటూ టిక్‌టాక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో ప‌డింది ఈ యాప్‌.

పంద్ర‌గ‌స్టు సంద‌ర్భంగా ఇప్ప‌టికే గూగుల్ ప్లేస్టోర్‌లోకి వ‌చ్చేసిన‌ ‘హైస్టార్’ యాప్.. షార్ట్ వీడియో ల‌వర్స్‌‌కు హాట్ ఫేవ‌రేట్‌గా మారుతోంది. మూడు నుంచి 60 సెకన్ల నిడివి ఉండే లిప్‌సింక్‌ వీడియోలు ఉంటాయిందులో. మనమూ మన గొంతుతో ప్రత్యేకంగా వీడియోలు చేయొచ్చు, వాటికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కలపొచ్చు. ‘హైస్టార్’ యాప్‌ ఓపెన్‌ చేయగానే దానిలో యూజర్లు అప్‌లోడ్‌ చేసిన ఇలాంటి ఎన్నో వీడియోలు కనిపిస్తాయి. నచ్చితే లైక్‌ కొట్టొచ్చు. కింద కామెంట్‌ సెక్షన్‌ కూడా ఉంటుంది. ఎవరి వీడియోలైనా మనకు బాగా నచ్చుతుంటే వాళ్లను ఫాలో అవ్వచ్చు. అప్పుడు వాళ్లు ఏ వీడియో అప్‌లోడ్‌ చేసినా మనకు కనిపిస్తుంది. ఆ వీడియో మనకు నచ్చితే ఆ వీడియో కింద ఉండే ఆప్షన్‌ ద్వారా అదే మ్యూజిక్‌ లేదా డైలాగ్‌కు మనం కూడా లిప్‌సింక్‌ ఇచ్చి ఆ క్లిప్‌ను అప్‌లోడ్‌ చేయొచ్చు. మన ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవచ్చు. ఇక సెర్చ్‌ విభాగంలో కామెడీ డైలాగ్‌లూ, ఇన్‌స్పిరేషన్‌ కోట్‌లూ, పాటలూ, సినిమా క్లిప్‌లూ, వంటలూ.. ఇలా బోలెడు రకాలుంటాయి. మనకు నచ్చిన దాన్ని ఎంచుకుని వీడియో చేసేయడమే. వాడకం సులభం, వీడియోల నిడివీ తక్కువ అందుకే.. ఈ యాప్ ఇప్పుడు ముఖ్యంగా యువ‌త మ‌న‌సు దోచుకుంటోంది. సెలబ్రిటీల నుంచి కాలేజీ పిల్లల దాకా అందరినీ తనవైపు లాగేస్తోంది.

అంతేకాదు, షార్ట్ వీడియోలు చేస్తూ పాపులారిటీ అందుకుంటున్న వారిని ‘హైస్టార్’గా గుర్తిస్తూ ప‌లు కంపెనీల‌కు అడ్వ‌ర్టైజ్‌మెంట్స్‌ల్లో న‌టించే అవ‌కాశం వీరికి ఈ యాప్ క‌ల్పిస్తుంది. అంటే ఓ వైపు పాపులారిటీ.. మ‌రోవైపు సంప‌ద‌న ఈ యాప్ వ‌ల్ల సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మొత్తానికి ‘హైస్టార్.. బీ సూప‌ర్‌ స్టార్..’ అంటూ వ‌చ్చిన‌ ఈ యాప్ యూత్‌ను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. యాప్ లింకు bit.ly/hystarapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *