వీనుల విందుగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్

వీనుల విందుగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్

 

హీరో సాయి తేజ్ నటించిన  తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. ఈ మూవీలో   నభా నటేష్ హీరోయిన్. సుబ్బు ఈ చిత్రానికి దర్శకుడు.  ఈ చిత్రాన్ని బి విఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా `హే ఇది నేనేనా..` అంటూ సాగే పాటను విడుదల చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెండవ పాట ఇప్పటికే యూత్ లో  వైరల్ అవుతోంది. సాంగ్ ఆద్యంతం లవ్ ఇంటెన్సిటీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సిద్  శ్రీరామ్ గాత్రం పెద్ద అస్సెట్ అనే చెప్పాలి. అతడి టోన్ ఈ ఓదార్పు గీతానికి సోలో బతుక్కి ఎంతో ఊరట. ఒంటరి బతుకు లవ్ లోకి ప్రవేశించాక ఇలానే ఉంటుంది మరి అన్న అర్థం ధ్వనించింది ఆ పాటలో. తేజ్ లో డెప్త్.. నభా నటేష్ కళ్ళలో భావాలు యువతరానికి చక్కిలిగింతలే పెడతాయి. వరుసగా చార్ట్ బస్టర్ పాటల్ని అందిస్తున్న థమన్ మరోసారి అలాంటి ఆల్బమ్ నే ఇవ్వనున్నాడన్న నమ్మకం పెరుగుతోంది. అల వైకుంఠపురములో చిత్రంలో ప్రతిపాటా దేనికదే ప్రత్యేకంగా నిలిచాయంటే తమన్ వల్లనే. ఇప్పుడు సోలో బ్రతుకే… పాటలు ఆకట్టుకుంటున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *