‘అల వైకుంఠపురములో’ రికార్డ్  స్థాయి టీ ఆర్పీ రేటింగ్

‘అల వైకుంఠపురములో’ రికార్డ్  స్థాయి టీ ఆర్పీ రేటింగ్

గత వారం ప్రముఖ ఛానెల్ లో అల వైకుంఠపురములో చిత్రాన్ని ప్రసారం చేశారు. ఈ చిత్రానికి రికార్డ్  స్థాయిలో 29.4టీ ఆర్పీ రేటింగ్ వచ్చింది.  తెలుగు చిత్రాల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అత్య‌ధికం అంటున్నారు. లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌లందరు ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో ఈ సినిమాని చాలా మంది వీక్షించిన‌ట్టు తెలుస్తుంది. కాగా, సినిమాలోని ప్ర‌తి సాంగ్ కూడా దేశ వ్యాప్తంగానే కాక విదేశీ ప్రేక్ష‌కుల‌ని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్‌, టబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించారు. ఆయ‌న సంగీతం సినిమాని ఓ రేంజ్‌లో నిల‌బెట్టింది. కేవ‌లం మ్యూజిక్ కోస‌మనే థియేటర్‌కి వెళ్ళి సినిమాని చూసిన వారు కోకొల్ల‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *