సెప్టెంబర్‌ 6న బిగ్‌బాస్‌-4 ప్రారంభం

సెప్టెంబర్‌ 6న బిగ్‌బాస్‌-4 ప్రారంభం

బిగ్‌బాస్‌-4 కోసం బుల్లితెర ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్‌కి సంబంధించి ప్రోమోలు కూడా విడుదల కావడంతో ఎప్పుడెప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్‌ 22న బిగ్‌బాస్‌ నాల్గొ సీజన్‌ ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ అది ఒట్టి పుకారే అని తేలింది. ఇక నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకొని ఆగస్ట్‌  29 లేదా 30న ప్రారంభం అవుతందని ప్రచారం కూడా జరుగుతోంది. కానీ అదీ కూడా అసత్య ప్రచారమే అని తెలుస్తోంది. పక్కా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్‌ మొదటి వారంలో బిగ్‌బాస్‌-4 ప్రారంభం కాబోతుంది. సాధారణంగా ‘స్టార్‌ మా’లో ఏ కొత్త షో అయినా శని, ఆదివారాల్లో ప్రారంభం అవుతుంది. దీన్ని బట్టి బిగ్‌బాస్‌-4  సెప్టెంబర్  6న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *