బాలు గారితో నేనూ గొంతు క‌ల‌ప‌డం నా అదృష్టం – `ఎళ్లిపోతావురా మ‌నిషి` సాంగ్ ఫేమ్ స్వాతిరెడ్డి (యు.కె)

శ్రీ త్రిదండి చిన జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మం పై దివంగత గాన గంధ‌ర్వుడు ఎస్.పి.బాలు ఆఖరి భ‌క్తి పాట- బాలు గారితో నేనూ గొంతు క‌ల‌ప‌డం నా అదృష్టం – `ఎళ్లిపోతావురా మ‌నిషి` సాంగ్ ఫేమ్ స్వాతిరెడ్డి (యు.కె)
 శ్రీ  త్రిదండి చిన జీయ‌ర్ స్వామి వారి పై  సింగ‌ర్ స్వాతి రెడ్డి ఓ వీడియో ఆల్బ‌మ్ రూపొందించారు.   కేదార్ నాథ్ సాహిత్యాన్ని స‌మ‌కూర్చ‌గా ప‌వ‌న్ బాణీలు క‌ట్టారు.  ఈ వీడియో ఆల్బ‌మ్ లో  `ఈ భాగ్య న‌గ‌రిలో భ‌ద్ర‌గిరి` అనే పాట‌ను దివంగ‌త గాన గంధ‌ర్వుడు ఎస్.పి. బాలసుబ్ర‌హ్మ‌ణ్యం, స్వాతి రెడ్డి  సంయుక్తంగా ఆల‌పించారు.  ఈ వీడియో ఆల్బ‌మ్ ఇటీవ‌ల శ్రీ త్రిదండి చిన జీయ‌ర్ స్వామి స్వ‌యంగా ఆయ‌న చేతుల మీదుగా ఆవిష్క‌రించి, సింగ‌ర్ స్వాతి రెడ్డి మ‌రియు నిర్మాత‌లు ఎల్. న‌రేంద్ర రెడ్డి, నాగోల్ బాల్ రెడ్డి ని అభినందించారు.
 ఈ సంద‌ర్భంగా  సింగ‌ర్ స్వాతి రెడ్డి మాట్లాడుతూ…“ ఓ రోజు విమానంలో ప్ర‌యాణం చేస్తుండ‌గా శ్రీ త్రిదండి చిన జీయ‌ర్ స్వామి వారిని అనుకోకుండా క‌లుసుకోని వారి ఆశీస్సులు అందుకోవ‌డం జ‌రిగింది.  అలా వారి పాద స్ప‌ర్శ‌తో నాలో నూత‌న ఉత్సాహం , ఉత్తేజం మొద‌లైంది. స్వామి వారి పై ఒక మంచి వీడియో ఆల్బ‌మ్ చేయాల‌నుకుంటోన్న త‌రుణంలో మిత్రుడు, పాట‌ల ర‌చ‌యిత కేదార్ నాథ్ గారు వారి పై అద్భుత‌మైన మూడు పాట‌లు రాశారు.  వెంట‌నే ఆ మూడు పాట‌లు రికార్డ్ చేసి ఓ రోజు చిన జీయ‌ర్ స్వామి వారిని క‌లిసి వారి ఆశ్ర‌మంలో మూడు పాట‌లు  వినిపించాము. ఆ మూడు పాట‌లు స్వామి గారికి న‌చ్చ‌డంతో ఆనందంగా వారి చేతుల మీదుగానే ఆవిష్క‌రించి మా అంద‌రికీ ఆశీస్సులు అందించారు. ఇందులో బాలు గారితో నేను `ఈ భాగ్య‌న‌గ‌రిలో భ‌ద్ర‌గిరి` అనే పాట పాడటం నా అదృష్టం.  పాట ఎంతో బావుందంటూ బాలు గారు మా అంద‌ర్నీ  మెచ్చుకున్నారు.   అలాంటి గొప్ప గాయ‌కులు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం బాధాక‌రం. వారికి నా శ్రద్ధాంజ‌లి ఘ‌టిస్తూ , మ‌రోమారు వారిని గుర్తు చేసుకుంటూ   `స్వాతిరెడ్డి యుకె` యూట్యూబ్ చాన‌ల్ లో  ఈ పాట‌ను రిలీజ్ చేశాం. పాట‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. విన్న‌వారంతా ప్ర‌శంసిస్తున్నారు. ఈ పాట‌ను సింగ‌ర్ స్వాతి రెడ్డి యుకె యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించ‌వ‌చ్చు.
ఈ పాట‌ల విష‌యంలో త‌మ పూర్తి స‌హ‌కారాన్ని అందించిన `JETUK.ORG  `వారికి ధ‌న్య‌వాదాలు.
  సాహిత్యంః కేదార్ నాథ్.పి
  సంగీతంః ప‌వ‌న్
  ఎడిట‌ర్ః  రామ‌కృష్ణ ఎమ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *