‘మ‌హాస‌ముద్రం’లో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌

 ‘మ‌హాస‌ముద్రం’లో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌

విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న హీరో శ‌ర్వానంద్‌, ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ క‌ల‌యిక‌లో ‘మ‌హాస‌ముద్రం’ చిత్రం రూపొంద‌నున్న‌ది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ స‌న్నాహాలు చేస్తోంది.

సెట్స్ మీద‌కు వెళ్ల‌క ముందే ఒక దాని త‌ర్వాత ఒక‌టిగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అనౌన్స్‌మెంట్లు ఇస్తూ ‘మ‌హాస‌ముద్రం’ ప్రాజెక్టుపై అంచ‌నాలు పెంచేస్తూ వ‌స్తున్నారు నిర్మాత‌లు.

ఇద్ద‌రు హీరోయిన్లు ఉండే త‌న చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల కోసం స‌రైన న‌టుల‌ను ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. క‌థ‌కు కీల‌క‌మైన ఒక హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం ఇప్ప‌టికే టాలెంటెడ్ యాక్ట్రెస్‌ అదితి రావ్ హైద‌రిని ఎంపిక చేశారు. కాగా లేటెస్ట్‌గా అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మ‌రో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌. నిజానికి ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కూ ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారు అజ‌య్ భూప‌తి.

ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా అయిన ‘మ‌హాస‌ముద్రం’ను ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్‌

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
బ్యాన‌ర్‌: ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *