రొమాన్స్ 2 ఇన్ 1 ఫస్ట్ లుక్ విడుదల 

రొమాన్స్ 2 ఇన్ 1 ఫస్ట్ లుక్ విడుదల
యావర అహమ్మద్, మనీషా పిలై ప్రధాన పాత్రలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ “రొమాన్స్ 2 ఇన్ 1”. ‘ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తే’ అనే ఆసక్తికరమైన కథ కథాంశం తో త్వరలో మీ ముందుకు వస్తుంది. శివ ఈ వెబ్ సిరీస్ ని స్వీయ దర్శకత్వం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ మాట్లాడుతూ “ఇది చాలా డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్  కథ. మంచి ఆసక్తికరమైన కథాంశం తో రూపొందిస్తునాం. ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ప్రేమిస్తుంటుంది. ఆలా ఒకే ఆత్మ హీరో హీరోయిన్ ఇద్దరినీ ఎందుకు ప్రేమిస్తుంది, ఆ ఆత్మ ఎవరు, తన కథ ఏంటి, చివరికి ఎమౌంతుంది అనేది కథ. ఈ రోజు దసరా సందర్భంగా మా “రొమాన్స్ 2 ఇన్ 1″ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాము. నవంబర్ లో టీజర్ ను విడుదల చేసి త్వరలో ఓ టి టి లో విడుదల చేస్తాం” అని తెలిపారు.
బ్యానర్ : జి.ఎస్.కె ప్రొడక్షన్స్
టైటిల్ : రొమాన్స్ 2 ఇన్ 1
సంగీతం : నవనీత్  చారి
కెమెరా మాన్ : గోపి
ఎడిటర్ : కృష్ణ
రచన, దర్శకత్వం, నిర్మాత : శివ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *