విజయదశమి కానుకగా ‘భద్రకాళి’ చిత్ర సప్త గీతాలు ఆవిష్కరణ

                 విజయదశమి కానుకగా ‘భద్రకాళి’ చిత్ర సప్త గీతాలు ఆవిష్కరణ
లెజెండరీ హీరోయిన్ జయప్రద తో 43 సంవత్సరాల క్రితం ‘భద్రకాళి’ అనే టైటిల్ తో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియెట్ చేసింది. మళ్ళీ అదే టైటిల్ తో  బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా వస్తున్న చిత్రం భద్రకాళి. ఈ చిత్రంలో ఏడు సూపర్‌హిట్‌ సాంగ్స్ వీగా మ్యూజిక్ ద్వారా ఆడియో విజయదశమి పండుగ కానుకగా ఈరోజు నటి సీత, కెమెరామెన్ విజయ్‌ టి, దర్శకుడు కె.ఎం.ఆనంద్‌ చేతులమీదుగా విడుదలచేశారు.
ఈ సందర్భంగా నటి సీత మాట్లాడుతూ : “ఈ చిత్రంలో నేను భద్రకాళి గా నటిస్తున్నాను. నా కెరీర్ లో ఇప్పటివరకు దేవత పాత్రలు ఎన్నో వేసాను కానీ రౌద్రం కూడిన  భద్రకాళి గా వేయడం ఇదే తొలిసారి, ఈ మధ్య భక్తిరస ప్రధాన చిత్రాలు రావడం లేదు అప్పట్లో ఫిలిం ద్వారా సినిమాలు నిర్మించేవారు గ్రాఫిక్స్ కి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు డిజిటల్ మూవీస్ వచ్చేశాయి అత్యుత్తమ సాంకేతిక విలువలతో  కూడిన చిత్రాలను రూపొందించడానికి అవకాశం వుంది.  ఈ చిత్రం కూడా ప్రస్తుతం వున్నా టెక్నాలజీ ని ఉపయోగించుకుని నిర్మిచారు. ”
దర్శకుడు కె . ఏం . ఆనంద్ మాట్లాడుతూ : “భద్రకాళి అమ్మవారికి ఓ భక్తుడికి మధ్య జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను రెడీ చేసాము. సీత గారు ఆ పాత్రలో అమ్మవారుగా ఒదిగిపోయారు. చిత్రంలోని సహజమైన విజువల్ ఎఫెక్ట్ కోసం గ్రాఫిక్స్ చేయడం జరిగింది. భక్తి రసప్రదాన చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది.  ఈ గ్యాప్ పూరించడానికి ఈ కథను ఎంపిక చేయడం జరిగింది” అన్నారు
నిర్మాత  చిక్కవరపు రాంబాబు మాట్లాడుతూ : “అన్నమయ్య,  అమ్మోరు, దేవుళ్ళు చిత్రాల స్థాయిలో ఈ చిత్రం వచ్చింది.  ఈ జోనర్ లో వున్నా సినిమాలకు సంగీతం ముఖ్యం అవి ఎవర్ గ్రీన్ గా ఉండాలి అందుకోసం  ఇందులో ఏడు పాటలు కూడా అదేస్థాయిలో రికార్డింగ్ చేసాము ఈ రోజు  వీగా మ్యూజిక్ ద్వారా విజయదశమి రోజున అమ్మవారు భద్రకాళి అశ్విర్వాదంతో విడుదల కావడం ఆనందంగా వుంది” అన్నారు.
నటీనటులు:- సీనియర్‌ నటి సీత, సంధ్య, మనీష్‌, తాగుబోతు రమేష్‌, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :- కెమెరా: విజయ్‌ టి, సంగీతం: ఆదీష్‌ ఉత్రియన్‌, గ్రాఫిక్స్‌: RGB స్టూడియోస్‌, డి.ఐ: ప్రభు, ఎడిటింగ్‌: జెమా, మాటలు: పోలూరుఘటికాచలం, పాటలు: శ్రీగురు,ఆర్ట్: వెంకటేష్, సమర్పణ: బేబి తనిష్క, బేబి జ్యోషిక, నిర్మాత: చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్‌.