పల్లెటూళ్ళ లోని అనుబంధాలు,ఆప్యాయత లనుచాటే “అన్నపూర్ణమ్మ గారి మనవడు”

పల్లెటూళ్ళ లోని అనుబంధాలు,ఆప్యాయత లనుచాటే “అన్నపూర్ణమ్మ గారి మనవడు”
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి యాంత్రిక జీవనం సాగిస్తూ…మనుషుల మధ్య ఉండాల్సిన బంధాలు, అనుబంధాలు ,ప్రేమ,ఆప్యాయత లను మరచిపోతున్న తరుణంలో బంధాల ప్రాముఖ్యతను చాటుతుంది ఈ “అన్నపూర్ణమ్మ గారిమనవడు” సినిమా. పచ్చని పల్లెటూరిలో జరిగే నాయనమ్మమనవడి కథే ఈ చిత్రం.
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కూతురు వాసిరెడ్డి అమృత,అక్కినేని అన్నపూర్ణమ్మ గారి కొడుకు అక్కినేని ప్రణయ్ ల మధ్య జరిగే అందమైన ప్రేమకథ. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారా..?లేక హతమార్చారా..? వీరి ప్రేమకు ప్రతి రూపమైన వంశీ తన నాయనమ్మ వద్ద కు ఎలాచేరాడు..?వంశీ తనమనవడు అని అన్నపూర్ణమ్మ ఎలా తెలుసుకుంటుంది..?అనే ప్రధాన కథాంశంతో సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో చిత్రాన్ని మలచిన తీరు దర్శకుడు నర్రాశివనాగేశ్వరరావు ప్రతిభను చాటుతుంది. ప్రత్యేకించి నాయనమ్మ,మనవడు మధ్య జరిగే  సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తాయి. అలనాటి అందాలనటి జమున 40సంవత్సరాల తర్వాత నటించడం ఈ చిత్రానికి ఫ్లస్ అని చెప్పవచ్చు. రఘుబాబు,సుమన్ శెట్టి,తాగుబోతు రమేష్,అదుర్స్ రఘు,జీవా ల కామిడీ ఆకట్టుకుంటుంది.రాజ్ కిరణ్ సంగీతం,గిరికుమార్ ఫోటోగ్రఫీ బాగున్నాయి. ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా నేను ఇస్తున్న రేటింగ్ 3/5.
        గాదె నాగభూషణం
        సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *