“30 రోజుల్లో ప్రేమించడం ఎలా” చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్

మేము ఊహించని దానికన్నా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్- నిర్మాత యస్వీ బాబు!!

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి ప్రదీప్ (మున్నా)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అభిరుచిగల నిర్మాత యస్వీ బాబు నిర్మించిన చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”. యూవీ, జిఎటు సంస్థలు ద్వారా ఈ చిత్రం జనవరి 29న (నేడు) వరల్డ్ వైడ్ గా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించి.. యునానిమస్ గా సూపర్ హిట్  టాక్ సొంతం చేసుకుంది.  ఆర్టీసి క్రాస్ రోడ్స్  సుదర్శన్ 35 యం.యం థియేటర్ లో ఆడియెన్స్ మధ్య చిత్ర యూనిట్ సినిమాని వీక్షించారు.. అనంతరం మీడియా సమావేశంలో…

హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. ‘ ఈ రోజు కోసమే ఇంతకాలం వెయిట్ చేశాం. ఫైనల్ గా మా సినిమా ఈరోజు రిలీజ్ అయింది.  ఏన్నో సంవత్సరాల నుండి ఇదే థియేటర్ లో సినిమాలు చూశాను. ఇప్పుడు నా సినిమా కూడా చూసుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సినిమాలో ప్రతీ సీన్, ప్రతీ పాటకు ఆడియెన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. విజిల్స్, క్లాప్స్ తో ప్రతీ ఒక్కరూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు మున్నా అనుకున్న కథకి, స్విచ్ వేషన్స్ కి తగ్గట్లుగా అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. తన మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోసాడు. అలాగే మా నిర్మాత బాబు గారు సినిమా మీద నమ్మకంతో ఇన్నిరోజులు వెయిట్ చేసి థియేటర్స్ లొనే మా సినిమాని రిలీజ్ చేశారు. ఓవర్ సీస్, ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లోనూ మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదలైన అన్నీ థియేటర్స్ ఫుల్స్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతీ ఒక్కరూ ఫోన్స్ చేసి సినిమా చాలా బాగుంది.. బాగా చేశారు.. అని చెప్తున్నారు.. ఇంతలా నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు నా ధన్యవాదాలు.. అన్నారు.

దర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) మాట్లాడుతూ.. ‘ మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా భారీ ఓపెనింగ్స్ తో సూపర్ హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత బాబు గారికి ప్రదీప్ కీ చాలా థాంక్స్.. అన్నారు.

నిర్మాత యస్వీ బాబు మాట్లాడుతూ.. ‘ నేను ఇప్పటివరకూ 18 సినిమాలు తీశాను.. కానీ ఈ చిత్రాన్ని డబ్బు ప్రదానంతో కాకుండా ఇష్టంతో చేశాను.. ఈ సినిమా ద్వారా ప్రదీప్, మున్నా ఇద్దరి జీవితాలు ఆదరపడ్డాయి. వారికోసం నేను ఇన్నీ రోజులు వెయిట్ చేసి థియేటర్స్ లొనే రిలీజ్ చేశాను. అన్నీ ఏరియాలనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ముఖ్యంగా ఈ చిత్రాన్ని మీడియా బాగా సపోర్ట్ చేసింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అసలు ఇంత ఒపెనింగ్స్, రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది.  మేము ఊహించిన దానికంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్.. అన్నారు.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘ నీలి నీలి పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమాని కూడా అంతే పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ నా స్పెషల్ థాంక్స్. పాటలతో పాటు రీ-రికార్డింగ్ చాలా బాగుంది అంటున్నారు.. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *