శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌ర‌ణ్

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌ర‌ణ్‌
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు… `జంటిల్‌మెన్‌, ఒకేఒక్క‌డు, అప‌రిచితుడు, శివాజి, రోబో` వంటి సెన్సేష‌న‌ల్ చిత్రాల‌ను చిత్ర‌సీమ‌కు అందించిన ద‌ర్శ‌క‌ధీరుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్నాడ‌న్న ఊహాగాణాలు ఒక్క‌సారిగా టాలీవుడ్ స‌ర్కిళ్ల‌ల్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ ఇద్ద‌రి క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రానికి బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నార‌ని తెలుస్తోంది.
ప్ర‌స్తుతం శంక‌ర్ – క‌మ‌ల‌హాస‌న్ తో `ఇండియ‌న్ 2` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రాంచ‌ర‌ణ్ కూడా `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు కంప్లీట్ అయిన త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ మొద‌లు పెడ‌తారాని స‌మాచారం. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే శంక‌ర్ – రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఓ మూవీ వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు భారీ  ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ఉంటారు. దాన్ని రీచ్ అయ్యే రేంజ్‌లో సినిమా ఉండాలని వారు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *