హీరో నాగ చైతన్య,సాయి పల్లవి “లవ్ స్టోరి”

మన చుట్టూ ఉండే జీవితాల కథలు, ఆ కథల్లో నిజాయితీ, కథనంలో సహజత్వంతో
సినిమాలు చేసే దర్శకుడు శేఖర్ కమ్ముల. అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి
పల్లవి జంటగా ఆయన రూపొందించిన కొత్త సినిమా “లవ్ స్టోరి”. టీజర్ తో
రేవంత్, మౌనికలుగా చైతూ, సాయి పల్లవిని పరిచయం చేసిన శేఖర్
కమ్ముల….ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారి ప్రేమ కథ ఎలాంటిదో పాటతో
తెలియజేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా,
అనురాగ్ కులకర్ణి పాడారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించారు. “నీ చిత్రం
చూసి.. పాట లిరికల్ వీడియోను వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు (ఫిబ్రవరి
14) ఉదయం 10.08 నిమిషాలకు విడుదల చేశారు.

“నీ చిత్రం చూసి”…పాటలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రేమ చిహ్నాలను
పెయిటింగ్స్ రూపంలో చూపించారు. హైదరాబాద్ నగర జీవితాన్ని తన చిత్రాలతో
అద్భుతంగా చూపించిన ప్రముఖ చిత్రకారుడు ‘మోషే దయాన్’ ఈ పాటలోని చిత్రాలను
గీశారు.

ఈ లిరికల్ వీడియో లో అలనాటి హైదరాబాద్ ప్రేమ చిహ్నలైన “పురాణ పూల్”
,”తారామతి బరాదారి”, “కోటి రెసిడెన్సీ”, “బ్రిటిష్ రెసిడెన్సీ” లను
చూపించిన శేఖర్ కమ్ముల చివరగా రేవంత్ మౌనిక ప్రేమ వారధి అయిన ‘రేవంత్
జుంబా సెంటర్’ ను పాటలో చూపించారు.

భాగ్యనగర ప్రేమ సౌధాలను పేర్కొంటూ  ‘రేవంత్ జుంబా సెంటర్’ ను చూపించడం
ద్వారా వీళ్లిద్దరి ప్రేమ కథ కూడా అలాంటి గొప్పదేనని దర్శకులు శేఖర్
కమ్ముల చెప్పకనే చెప్పారు.

ఏప్రిల్ 16న “లవ్ స్టోరి” సినిమా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు
సిద్ధమవుతోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్
సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.
రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ
రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్
కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,
పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర
రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు,
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *