ఆకట్టుకుంటోన్న ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ ‘రాబర్ట్‌’ ట్రైలర్‌.. మార్చి 11న మూవీ గ్రాండ్‌ రిలీజ్‌

ఆకట్టుకుంటోన్న ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ ‘రాబర్ట్‌’ ట్రైలర్‌.. మార్చి 11న మూవీ గ్రాండ్‌ రిలీజ్‌
 ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ క‌థానాయ‌కుడిగా ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమాప‌తి శ్రీనివాస గౌడ నిర్మిస్తోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాబ‌ర్ట్‌’.  దర్శన్‌ పుట్టినరోజు నేడు(ఫిబ్రవరి 16) ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ట్రైలర్‌ విషయానికి వస్తే..
“నన్ను అంతం చేయాలనుకున్నవాడు నా కన్నా పెద్ద క్రిమినల్‌ బ్రెయిన్‌ అయ్యుండాలి… నా కన్నా టెర్రర్‌ అయ్యుండాలి.. నా కన్నా వయొలెంట్‌ అయ్యుండాలి.
అంతటి మగాడు ఈ భూమ్మీదున్నాడా.. హై కోయి.. ఉన్నాడా?” అని విలన్‌ ఛాలెంజ్‌ విసురుతాడు.. ఆ డైలాగ్స్‌కు తగినట్లు దర్శన్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసేలా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
“ఒకరి లైఫ్‌లో హీరో అవ్వాలనుకుంటే ఒకరి లైఫ్‌లో విలన్‌ అవ్వాల్సిందే”, “అరే తుతుంబర్‌ నువ్వు మాస్‌ అయితే నేను మాస్‌కే…”  అంటూ దర్శన్‌ చెప్పే డైలాగ్‌తో, తనపై చూపించిన యాక్షన్‌ సన్నివేశాలు హీరో దర్శన్‌ క్యారెక్టర్‌ ఏంటో చెబుతూ విలనిజాన్ని ఎలివేట్‌ చేసేలా ఉన్నాయి.
“మనిషికి రెండుసార్లు వణుకు పుడుతుంది. ఒకటి చలి వేసినప్పుడు.. రెండు బాగా భయం వేసినప్పుడు” అనే డైలాగ్‌తో జగపతిబాబు క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్‌ చేశారు. అలాగే రవికిషన్‌, దేవరాజ్‌, హీరోయిన్‌ ఆశా భట్‌ పాత్రలను ట్రైలర్‌లో చూపించారు.
“ఈ రాఘవకి శబరి ముందు తలదించడమూ తెలుసు.. రావణుడి తల తెంచడమూ తెలుసు.. నీ కౌంట్‌ డౌన్ స్టార్స్‌” అంటూ దర్శన్‌ ట్రైలర్‌ ఎండింగ్‌లో చెప్పిన డైలాగ్‌ నెక్ట్స్‌ రేంజ్‌లో మాస్‌ను ఎలివేట్‌ చేస్తుంది.
మాస్‌ ఎలిమెంట్స్‌, ఎమోషన్స్‌, ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్‌ అంశాలు అన్నింటినీ కలగలిపి దర్శకుడు తరుణ్‌ కిషోర్‌ సుధీర్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘రాబ‌ర్ట్‌’ సినిమాను తెరకెక్కించాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్‌ మరింత పెంచింది. మార్చి 11న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది.
నటీనటులు:
దర్శన్‌, జగపతిబాబు, రవికిషన్‌, ఆశా భట్‌, దేవ్‌రాజ్‌, రవిశంకర్‌ తదితరులు
సాంకేతిక వర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  త‌రుణ్ కిషోర్ సుధీర్‌
నిర్మాత‌:  ఉమాప‌తి శ్రీనివాస్ గౌడ
సంగీతం:  అర్జున్ జ‌న్యా
సినిమాటోగ్ర‌ఫీ:  సుధాక‌ర్ ఎస్‌.రాజ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  మోహ‌న్ బి.కేరే
ఎడిట‌ర్‌:  కె.ఎం.ప్ర‌కాశ్‌
డైలాగ్స్‌:  హ‌నుమాన్ చౌద‌రి
పాట‌లు:  భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీమ‌ణి, కాసర్ల‌శ్యామ్‌
యాక్ష‌న్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌, అన్బు అరివు, వినోద్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ద‌ర్శ‌న్ ఎస్‌, చిరాగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *