పవర్ ప్లే మూవీ రివ్యూ

విడుదల తేదీ : మార్చి 05, 2021
నటీనటులు : రాజ్ తరుణ్, పూర్ణ, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌ త‌దిత‌రులు.
దర్శకత్వం : విజ‌య్ కుమార్ కొండా
నిర్మాత‌లు : మ‌హిద‌ర్‌, దేవేష్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : ఐ. ఆండ్రూ
ఎడిటింగ్ : ప‌్ర‌వీణ్ పూడి

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందిన ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. ఫ‌స్ట్‌లుక్‌ మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపులో మంచి పబ్లిసిటీతో సినిమాను సైతం ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నామే ఉత్సాహంతో ఉన్న టీం కు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇచ్చారో చూద్దాం.

కథలోకి వెళ్తే:

రాజ్ తరుణ్ కెరీర్లో ఇది విభిన్నమైన చిత్రం. ఈ తరహా పాత్ర గతంలో రాజ్ చేయలేదు. క్యారెక్టర్లో ఇన్ వాల్వ్ అయి నటించాడు. పాత్రలో ఉన్న షెడ్స్ ని బాగా చూపించగలిగాడు. అనుకోకుండా నకిలీ నోట్ల కేసులో ఇరుక్కోవడం… అందులో నుంచి బయటికి రావడం కోసం అతను చేసే ప్రయత్నాలు… ఈ ప్రయాణంలో చాలా సంఘటనలు జరగడం… కథలో అనేక మలుపులు వస్తాయి. ప్రతీ సీన్ లోనూ రాజ్ తన నట ప్రతాపం చూపించాడనే చెప్పాలి. ముఖ్యంగా సాధారణ వ్యక్తి సీరియస్ గా మారితే ఎలా ఉంటుందో చూపించాడు. హీరోయిన్ తో మంచి లిప్ లాక్ సీన్ లోనూ నటించాడు. ఇందులో లవ్ కంటే కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. హీరోయిన్ హేమల్ కూడా చూడటానికి బాగుంది. ఉన్నంతలో తన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించింది. ఈ సినిమాకు మరో ముఖ్యమైన హైలైట్ క్యారెక్టర్ అంటే పూర్ణాదే. పూర్ణ సినిమాలో ఉన్నంత సేపూ కిక్కిస్తుంది. ఆమె మీద దర్శకుడు రాసుకున్న సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఊహించని ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ప్రతీ సీన్ కొత్తగా అనిపిస్తుంది. ప్రిన్స్ స్పెషల్ అప్పీయరెన్స్ లో నటించాడు. అజయ్, పూజా రామచంద్రన్, కోట శ్రీనివాస రావు, మధునందన్ రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ కీలక పాత్రల్లో నటించారు.
హీరో నకిలీ నోట్ల కేసులో ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి అతను బయటపడటానికి చేసే ప్రయత్నాలే ఈ సినిమా. లైన్ సింపుల్ గా ఉన్నా… సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాల దగ్గరి నుంచి ప్రతీ పది నిమిషాలకో ట్విస్టు వస్తుంటుంది. దర్శకుడు విజయ్ కుమార్ ట్విస్టుల్ని ఎక్కడ చూపించాలో ఎక్కడ విప్పాలో పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాకు కథతోపాటు స్క్రీన్ ప్లే చాలా కీలకం. ఆ స్క్రీన్ ప్లేను పక్కాగా అమలు చేశారు. అందుకే దర్శకుడు విజయ్ కుమార్ కొండా సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వగలిగారు. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా రాజ్ తరుణ్ పెర్ పార్మెన్స్ చాలా బాగుంది. దర్శకుడు విజయ్ కుమార్ కొండా పూర్ణ సీన్స్ ని బాగా చిత్రీకరించారు. సినిమాకు ఈ సీన్స్ బాగా హైలైట్ గా నిలిచాయి. కథలో ఇంటెన్సిటీని పెంచాయి. క్యూరియాసిటీ కలిగించాయి.. లాజిక్స్ ఎక్కడా మిస్ కాకుండా చాలా కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేశారు. గతంలో లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీసిన విజయ్ ఈ సారి డిఫరెంట్ పంథాలో వెళ్లి సక్సెస్ సాధించారనే చెప్పాలి.
సురేష్ బొబ్బిలి సంగీతం సినిమా కి ప్లస్ అయ్యింది. ఆ ర్ ఆర్ తో ప్రతీ సన్నివేశాన్ని మరింత హైలైట్ చేశారు. ఆండ్రూ కెమెరా వర్క్ చాలా బాగుంది. కెమెరాతో ఇంటెన్సిటీ క్రియేట్ చేయగలిగారు. ప్రవీణ్ పూడి ఎక్స్ పీరియెన్స్ ఎడిటింగ్ లో ఉపయోగపడింది. నంద్యాల రవి డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా మంచి క్వాలిటీ చిత్రాన్ని అందించారు.

ఫైనల్ గా…

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. కానీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీసిన విజయ్ కుమార్ కొండా పవర్ ప్లే చిత్రాన్ని మెప్పించడం మెచ్చుకోదగ్గ విషయం. రాజ్ తరుణ్ కెరీర్లో మరో మంచి విజయం అందుకున్న చిత్రమిది. దర్శకుడిగా ఈ సినిమాతో మరో మెట్టు ఎదిగినట్టే. థ్రిల్లర్ సినిమాల్ని అమితంగా ఇష్టపడే వాళ్ల తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని సైతం ఆకట్టుకునే చిత్రం పవర్ ప్లే మూవీ. సో ఫ్యామిలీ తో వెళ్లి ఈ వీకెండ్ ఎంజాయ్ చెయ్యండి.

బాక్సాఫీస్ రేటింగ్ : 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *