‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’మూవీకి స్క్రిప్ట్ కు పూజాకార్యక్రమాలు

ఉగాది సందర్భంగా ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’మూవీకి స్క్రిప్ట్ కు పూజాకార్యక్రమాలు

సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’.
ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 11 గంటలకు ఈ చిత్ర స్క్రిప్ట్ కు పూజాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 25 నుంచి నెల్లూర్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత అరకు, బెంగళూరులో జరిగే షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. ఆగస్ట్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
జి రవితేజ సమర్ఫణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్, నిర్మిస్తుండగా.. సి.హెచ్.సత్య సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ఇది. సత్యసుమన్ బాబుకు ఇది హీరోగా రెండో సినిమా. హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేయబోతోన్న ఈ చిత్రంలో సుమన్,షియాజీ షిండే, చలపతి, నరేష్, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రల్లో నటించబోతున్నారు.
టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న చిత్రానికి
మాటలు : రామకృష్ణ
సంగీతం : ప్రమోద్ పులిగిళ్ల
సినిమాటోగ్రఫీ : అడపా సతీష్
ఆర్ట్ : నాని
కో డైరెక్టో నవీన్ రామ్ నల్లం రెడ్డి
ఆర్ఆర్ : చిన్నా
పిఆర్వో : దుద్ది శ్రీను
నిర్మాత, దర్శకత్వం : సి.హెచ్.సత్య సుమన్ బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *