జూబ్లీ హిల్స్ స్కాం లో అసలు నిజాలు ఏంటి..!!

జూబ్లీ హిల్స్ స్కాం లో అసలు నిజాలు ఏంటి..!!

ఒక వ్యక్తి ఎదుగుతుంటే తొక్కేయడం మన బడా బాబులకు అలవాటే.. ఒకడు మంచి పని చేసిన, ప్రజల్లో ఆదరణ దక్కించుకుంటున్న ఎందుకో ఎక్కడలేని అసూయా, ఈర్ష్య ద్వేషాలు వస్తాయి.. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. NTV founder Tummala Narendra Chowdary మీడియా రంగంలో ఎనలేని సేవలందించిన విషయం మనకు తెలిసిందే. జర్నలిజానికి నిలువెత్తు రూపంగా ఆయనని అభివర్ణిస్తారు పాత్రికేయులు.. అలాంటి అయన పై బురదచల్లే ప్రయత్న చేస్తున్నారు.. అయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులు దౌర్జన్యంగా బనాయించి అయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్న చేస్తున్నారు..

ప్రధానంగా ఓ స్కాం లో అయన పేరు ఎక్కువగా వినపడుతుంది.. అదే జూబ్లీ హిల్స్ స్కాం.. ఇప్పటివరకు క్లీన్ చీట్ గా ఉన్న చౌదరి గారి పేరు తెర మీదకు హఠాత్తుగా రావడానికి అనేక కారణాలున్నాయి. మొన్నమొన్నటి వరకు Tummala Narendra Chowdary అధ్యక్షతలో ఉంది జూబిలీ హిల్స్ cooperative society ప్యానెల్.. కానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో tv5 ప్యానెల్ గెలుపొందింది.. కాగా ఈ పోటీలో Tummala Narendra Chowdary పాల్గొనలేదు.. అయన బలపరిచిన ప్యానెల్ ఓడిపోయింది. అయితే అసలు సంగతి ఇక్కడే మొదలైంది.. గత నెల చివరి వరకు ఈ స్కాం కు సంభందించి ఎటువంటి మూలాలు లేవు కానీ హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక నరేంద్ర చౌదరి మీద కొంత మంది పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నం లో భాగంగా జరిగిన కుట్రకు పునాది తెలుస్తుంది..

Jubilee hills cooperative house building society కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన tv5 Managing Director Ravindranath Bollimeni, Narendra Chowdary పైన గత ప్యానెల్ సెక్రెటరీ అయిన T hanumantha Rao పైన భూ కబ్జా కింద కేసు పెట్టడం జరిగింది. అది కూడా గెలిచినా తరువాత.. అంతకుముందు ఈ కేసు ఎక్కడికిపోయింది అని ప్రశ్నిస్తున్నారు సామాన్య జనాలు.. గతంలో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఈ వ్యవహారాన్ని ఇప్పుడు స్కాం పేరుతో బయటకు తీసుకురావడం వెనుక అసలు కోణం ఆయనపై బురద చల్లడమే అని క్లియర్ గా తెలుస్తుంది.

గత అధ్యక్షుడయిన T Narendra Chowdary వ్యక్తిగా , సామాజిక సంస్కర్త గా తన వ్యాపార దక్షతకు సమాజ సేవ దృక్పధం జోడించి అనేకానేక వ్యక్తి వికాస మరియు సమాజ వికాస కార్యక్రమాల్లో తన వంతు అద్వితీయమైన కృషిని కొనసాగించారని ప్యానెల్ లోని సభ్యులు కొనియాడారు.. Media రంగంలోNTV, ప్రప్రథమ తెలుగు భక్తి ప్రధాన ఛానల్ భక్తి టీవీ, మరియు మహిళా సాధికారత కొరకు వనిత tv ని స్థాపించి అనేక మందికి మార్గదర్శకులయ్యారు. ఆఖరికి ఛానళ్ల విషయంలోనూ ఆయనను కృంగదీసే ప్రయత్న చేస్తున్నారు.. ఎంతో ఆధ్యాతికతను ప్రేక్షకులను పంచుతున్న భక్తి ఛానల్ ను రానివ్వకుండా, పాపులర్ కానివ్వకుండా కొంతమంది మీడియా బడా బాబు లు చూస్తున్నారు.. ఆ ఛానల్ గురించి బ్యాడ్ గా కొన్ని వెబ్ సైట్ లు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచురింపచేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.

కోటిదీపోత్సవం వంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు పునాది వేసిన ఓ సంఘసంస్కర్త ని పై ఎంతమంది ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలనీ చూసినా దాన్ని ఎదుర్కొని నిలబడతారు తప్పా కృంగిపోరు అని ఆయన్ని అభిమానించే వారు అంటున్నారు.. .. ఆయనను దిగజార్చడానికి ప్రముఖ మీడియా సంస్థలు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయని ఇప్పటికే తెలుస్తుంది. వీటన్నిటికీ Tummala Narendra Chowdary గారు సమాధాన ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *