‘ఫైటర్ శివ’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా కళాకారులకి నిత్యావసర వస్తువులను సరఫరా చేసిన చిత్ర బృందం .

‘ఫైటర్ శివ’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా కళాకారులకి నిత్యావసర వస్తువులను సరఫరా చేసిన చిత్ర బృందం ..!!

కౌండిన్య ప్రొడక్షన్ బ్యానర్ పై జి.నరసింహ గౌడ్ ప్రొడ్యూసర్ గా ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ చిత్రం ‘ఫైటర్ శివ’.. మణికాంత్ , శీతల్ భట్ హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ చిత్రం లో హీరో సునీల్ సిబీఐ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నారు.. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా కరోనా కారణం గా ఇబ్బందులు పడుతున్న కళాకారులకి నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది చిత్ర బృందం..

ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం.. చివరి షెడ్యూల్ ప్లాన్ చేసాము.. సినిమా ఇప్పటివరకు బాగా వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం కానీ లాక్ డౌన్ వల్ల అది కుదరలేదు.. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు పది రోజులకు సరిపడా రేషన్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది.. వెంటనే కో ఆర్డినేటర్ కృష్ణ ను సంప్రదించి, కళాకారులను పిలిపించి, వారి సమక్షంలోనే ఈ సినిమా పోస్టర్ లాంచ్ జరిపించి 200 మంది కళాకారులకు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్&ఫైనాన్సర్ చింతపల్లి రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.. అన్నారు..

నిర్మాత జి.నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా మూడో షెడ్యూల్ చేస్తాం.. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.. హీరో హీరోయిన్ లు చక్కగా నటించారు.. దర్శకుడు ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. అన్నారు..

నటీనటులు

మణికాంత్, శీతల్, సునీల్, మధుసూదన్, పోసాని కృష్ణ మురళి, అర్జున్ రెడీ అభయ్, RX100 లక్ష్మణ్, ఘర్షణ శ్రీనివాస్, తదితరులు…

సాంకేతిక నిపుణులు :

ఫైట్స్ : నభ
కెమెరా : సంజయ్ లోకనాథ్
మాటలు : బయ్యారపు రవి
మ్యూజిక్ : మణిశర్మ
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం : ప్రభాస్ నిమ్మల
ప్రొడ్యూసర్ : నర్సింహా గౌడ్.జి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *