వరహాలమ్మ ఫిలిమ్స్ పతాకంపై “ప్రొడక్షన్ నెం.1” చిత్రం ప్రారంభం

వరహాలమ్మ ఫిలిమ్స్ పతాకంపై “ప్రొడక్షన్ నెం.1” చిత్రం ప్రారంభం

 

వరహాలమ్మ ఫిలిమ్స్ పతాకంపై లక్ష్మ రెడ్డి దర్శకత్వంలో, వి. కృష్ణ నిర్మాతగా “ప్రొడక్షన్ నెం.1” చిత్రం ఈ రోజు తెలంగాణ ఫిలింఛాంబర్లో ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా శివరాఖీ, ప్రసన్న, అనూష, నిహారిక, విలన్ పాత్రలో గిరి యాదవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ నివ్వగా, ఫస్ట్ షాట్ డైరెక్షన్ ఎస్. నరహరి, పూజా కార్యక్రమాన్ని దర్శకుడు లక్ష్మ రెడ్డి నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ నూతన తారగణంతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని, తెలంగాణ ఫిలింఛాంబర్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ దర్శక నిర్మాతలకు వుంటాయని తెలిపారు. నటిస్తున్న నటీనటులకు తన శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఒక పల్లెటూరి ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇతివృత్తంగా తీసుకుని, ప్రొడక్షన్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించాలని ఈ చిత్రాన్ని ప్రారంభించాము. ఈ నెల10 వ తేదీ నుండి రెగులర్ షూటింగ్ ప్రారంభించి సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాము. చీరాల, హైద్రాబాద్ తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో 4 పాటలు ఉంటాయి. అద్భుతమైన లొకేషన్ లలో ఈ పాటలు చిత్రీకరిస్తాం. మా సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *