*యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభమైన “త్రైతం” షూటింగ్*

 

*యంగ్ హీరో నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభమైన “త్రైతం” షూటింగ్*

*భగవద్గీత లోని “త్రైతం” సిద్ధాంతాన్ని తీసుకొని మనిషి వున్నాడు, దేవుడు వున్నాడు, అలాగే ఆత్మ కూడా ఉందనే కాన్సెప్ట్ తో హీరోయిన్ మౌర్యాని ప్రధాన పాత్రలో శుభలేఖ సుధాకర్, రాజేశ్వరి నాయర్ నటీనటులుగా వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై రవికుమార్.ఎస్ ను దర్శకుడిని పరిచయం చేస్తూ పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ “త్రైతం” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిఖిల్ సినిమాకు క్లాప్ నివ్వగా చందు మొండేటి కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో*

*చిత్ర దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ..* వి ఆర్ పి క్రియేషన్స్ లో వస్తున్న మూడవ సినిమాకు నేను దర్శకత్వం వహించడం అదృష్టం గా భావిస్తున్నాను. ఈ సినిమా పూజ కార్యక్రమానికి పిలవగానే హీరో నిఖిల్ గారు, చందు మొండేటి గార్లు మా చిన్న సినిమాను ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను నిర్మాతకు, హీరోయిన్ మౌర్యానికి కథ చెప్పగానే నా కథను నమ్మి నాకీ సినిమా చేసే అవకాశం ఇచ్చారు నిర్మాత. వారికి నా ధన్యవాదాలు. లేడీ ఓరియెంటెడ్ కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెండు షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తి చేస్తాము. “త్రైతం” అనేది భగవద్గీత లో ఒక సిద్ధాంతం. “త్రైతం” అంటే మూడు యాక్సెప్టెన్స్ అని..అవి మనిషి వున్నాడు, దేవుడు వున్నాడు. అలాగే ఆత్మ కూడా ఉందనేది త్రైతం సిద్ధాంతం. దానికి ఈ సినిమాకు ఏమిటి సంబంధం అనేది మేము ఈ సినిమాలో చూపించబోతున్నాం.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు.

*నిర్మాత పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ* …వి ఆర్ పి క్రియేషన్స్ లో నా మొదటి సినిమా “వన్ బై టెన్” రెండో సినిమా “జరగని కథ” చేయడం జరిగింది. రవి నాకు లేడీ ఓరియెంటెడ్ కథ చెప్పగానే ఈ కథ నచ్చి వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొని అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది.ఇది పక్కా లేడీ ఓరియెంటెడ్ కథ అయినందున ఈ కథకు ఎవరైతే బాగుంటుందని దర్శకుడు రవి తో డిస్కర్షన్ చేసి మౌర్యానిని సెలెక్ట్ చేయడం జరిగింది. తను ఒప్పుకున్న వెంటనే సినిమా షూట్ కు సిద్ధమయ్యాము. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది. మా సినిమా పూజ కార్యక్రమానికి వచ్చి మా సినిమాను బ్లెస్స్ చేసిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు అని అన్నారు.

*హీరోయిన్ మౌర్యాని మాట్లాడుతూ* .. త్రైతం అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. రవిగారు నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్స్ అయ్యి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇలాంటి మంచి కథలో నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత తనయుడు మల్లిబాబు, రమేష్ రాజు తదితరులు పాల్గొని చిత్రం విజయం సాధించాలని ప్రసంగించారు

*నటీనటులు*
మౌర్యాని, శుభలేఖ సుధాకర్,
రాజేశ్వరి నాయర్ తదితరులు

*సాంకేతిక నిపుణులు*
కెమెరా :జి అమర్
సంగీతం : ఘన శ్యామ్
ఎడిటర్ : కారుమంచి నాని బాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నితిన్ కుమార్.ఆర్
ప్రొడ్యూసర్ : పసుపులేటి వెంకటరమణ
రచన దర్శకత్వం : రవికుమార్.ఎస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *