“మధురై సింగం” గా నందమూరి హీరో

“మధురై సింగం” గా నందమూరి హీరో
     బెజవాడలో దేవినేని నెహ్రూ వంగవీటి రంగాల ఫ్యాక్షన్ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగా  దేవినేని వంగవీటి రెండు వర్గాల మధ్య చెలరేగిన పగ,  ప్రతీకారాలు తారాస్థాయికి చేరటం వల్ల ఫ్యాక్షనిజం,  గూండాయిజం పెచ్చు పెరగడంతో బెజవాడ కత్తుల వాడగా ఎలా మారిందో కళ్లకు కట్టినట్టు చూపించాడు డైనమిక్ డైరెక్టర్ నర్రా శివనాగు.
      రాజకీయ నాయకుల్ని సైతం షేక్ చేసిన ఈ “దేవినేని” చిత్రం విడుదల విషయంలో సంచలనం స్రుష్టించిన సంగతి అందరికీ తెలిసినదే. వాస్తవ సంఘటనల వల్ల తమ రాజకీయ జీవితాలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని కొంతమంది  బెజవాడ రాజకీయ నాయకుల్ని సైతం నిద్ర పట్టకుండా చేసిందీ చిత్రం.
     ఈ “దేవినేని” చిత్రమే ఇప్పుడు తమిళంలో “మధురై సింగం” గా తమిళనాడులో విజయఢంకా మోగించబోవటం విశేషం.
     యువ నటసింహం నందమూరి తారకరత్న ఈచిత్రం టైటిల్ రోల్ పోషించాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *