శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న `అండ‌ర్ వ‌ర‌ల్డ్ బిలియ‌నీర్స్`

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న `అండ‌ర్ వ‌ర‌ల్డ్ బిలియ‌నీర్స్`

ఎల్‌.య‌స్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై అర‌వింద్ కృష్ణ‌, రాధిక ప్రీతి హీరో హీరోయిన్లుగా జ్యోతిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో గ‌గ‌న్ గోపాల్ ముల్క ద‌ర్శ‌క‌త్వంలో మ‌మ‌త‌, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ `అండ‌ర్ వ‌ర‌ల్డ్ బిలియ‌నీర్స్`. డ్ర‌గ్ మాఫియా నేప‌థ్యంలో ప‌ది ఎపిసోడ్స్ గ‌ల ఈ వెబ్ సిరీస్ ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభించుకుని ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ…“ఎల్‌.య‌స్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మేము రూపొందిస్తోన్న మొద‌టి వెబ్ సిరీస్ `అండ‌ర్ వ‌ర‌ల్డ్ బిలియ‌నీర్స్`. ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ ని మా ద‌ర్శ‌కుడు గ‌గ‌న్‌గోపాల్ ముల్క రూపొందిస్తున్నారు. ప్ర‌తి ఎసిపోడ్ ఎంతో ఇంటిలిజెంట్ గా, ఇన్నోవేటివ్‌గా ఉంటుంది. ఇటీవ‌ల ప్రారంభ‌మైన మా వెబ్ సిరీస్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మా హీరో అర‌వింద కృష్ణ గారు ఎంతో స‌పోర్ట్ చేస్తున్నారు. అలాగే మా టెక్నిక‌ల్ టీమ్ స‌పోర్ట్ తో అనుకున్న విధంగా తీయ‌గ‌ల్గుతున్నాం. దీనికి డి.వేణుగోపాల్‌, రాజ‌రాజేశ్వ‌రి కో-ప్రొడ్యూస‌ర్స్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు“ అన్నారు.
ద‌ర్శ‌కుడు గ‌గ‌న్ గోపాల్ ముల్క మాట్లాడుతూ…“ భార‌త‌దేశం భ‌విష్య‌త్ లో నెం-1 స్థానంలో ఉండ‌బోతున్నఉద్దేశంతో కొన్ని దేశాలు క‌క్ష గ‌ట్టి ఇక్క‌డి యువ‌త‌ని టార్గెట్ చేసి నిర్వీర్యం చేయాల‌ని ప్లాన్ చేస్తారు. దీన్ని హీరో ఎలా చేధించాడు అన్న‌ది `అండ‌ర్ వ‌ర‌ల్డ్ బిలియ‌నీర్స్ మెయిన్ స్టోరి. ప్ర‌తి ఎపిసోడ్ కొత్త‌గా ఉంటుంది. హీరో అర‌వింద్ గారు ఎంతో కో-ఆప‌రేట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్త‌యింది. మారెడు మిల్లి ఫారెస్ట్ , గోవాల్లో త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేసాం. ఇందులో సీనియ‌ర్ ఆర్టిస్ట్స్ చాలా మంది న‌టిస్తున్నారు“ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేందర్ రెడ్డి, డైలాగ్స్: లీలా సుబ్రహ్మణ్యం, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం. కృష్ణారెడ్డి, కో డైరెక్టర్: పి. నవీన్ కుమార్, సహా నిర్మాతలు: డి. వేణుగోపాల్, రాజరాజేశ్వరి, నిర్మాతలు: మమత, శ్రీనివాస్, స్టొరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గగన్ గోపాల్ ముల్క.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *