బి.వి.సి బ్యాన‌ర్‌పై లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ‘అరె ఒ సాంబ‌’

బి.వి.సి బ్యాన‌ర్‌పై లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ‘అరె ఒ సాంబ‌’
బీవీసీ బ్యాన‌ర్‌పై మిస్ట‌ర్ ఇండియా 2020-21, ఇంట‌ర్నేష‌న‌ల్ మోడ‌ల్ అనీల్ హీరోగా..బాల‌మిత్ర మూవీ ఫేమ్ కియా హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘అరె ఒ సాంబ‌’. గోపి కాక‌ర్ల ద‌ర్శ‌కుడు. అరుణ్ చంద్ర‌, న‌రేశ్ మ‌ల్లారెడ్డి నిర్మాత‌లు. ఈ ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యుల‌తో పాటు రాజ్ కందుకూరి, సురేశ్ కొండేటి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…
నిర్మాత సురేశ్ కొండేటి మాట్లాడుతూ ‘‘‘అరె ఒ సాంబ’ టైటిల్ విన‌డానికే చాలా బావుంది. ఇంత మంచి టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. సినిమా డైరెక్ట‌ర్ గోపి కాకర్లకి, ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘‘అరె ఒ సాంబ‌’ సినిమాను గోపి కాక‌ర్ల అనే డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో మెయిన్ లీడ్‌గా చేస్తున్న అనీల్‌, కియాల‌కు, నిర్మాత‌లు అరుణ్‌, న‌రేశ్ మ‌ల్లారెడ్డిల‌కు అభినంద‌న‌లు.క్వాలిటీ సినిమా చేసి స‌క్సెస్ సాధించాల‌ని టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను’’ అన్నారు.
ర‌చ్చ ర‌వి మాట్లాడుతూ ‘‘బీవీసీ బ్యాన‌ర్‌పై అరుణ్ చంద్ర‌, న‌రేశ్ మ‌ల్లారెడ్డిగారు క‌లిసి ఓ మంచి కాన్సెప్ట్‌తో చేస్తున్న సినిమాయే అరె ఒ సాంబ‌. గోపి కాక‌ర్ల డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్పుడు మంచి కాన్సెప్ట్‌ల‌తో సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. అలాగే ఓ మంచి కథాంశంతో వస్తున్న అరె ఒ సాంబ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.
రైజింగ్ రాజు మాట్లాడుతూ ‘‘అరె ఒ  సాంబ.. టైటిలే ఆక్టుకుంటోంది. రేపు సినిమా కూడా అదే రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు.
హీరో ర‌మ‌ణ్ మాట్లాడుతూ ‘‘బీవీసీ బ్యానర్ అంటే మా హోం బ్యానర్‌తో స‌మానం. ఎందుకంటే ఈ బ్యాన‌ర్‌లో ఇప్పుడు ఓ సినిమా చేయ‌బోతున్నాను. ఇప్పుడు రాబోతున్న సినిమా అరె ఒ సాంబ డిఫ‌రెంట్ మూవీగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. హీరో అనిల్‌, హీరోయిన్ కియా స‌హా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావు మాట్లాడుతూ ‘‘‘అరె ఒ సాంబ’ టైటిల్ ఎట్రాక్టివ్‌గా ఉంది. సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాం’’ అన్నారు.
హీరో అనిల్ మాట్లాడుతూ ‘‘అరె ఒ సాంబ’ అని వింటుంటే టైటిల్ ఎంత క్యాచీగా ఉందో అనిపిస్తుంది కదా, అలాగే స్టోరి కూడా అంతే బావుంటుంది. నిర్మాతలు అరుణ్, మల్లారెడ్డి, దర్శకుడు గోపి గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అన్నారు.
హీరోయిన్ కియా మాట్లాడుతూ ‘‘బీవీసీ బ్యానర్‌లో న‌టిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.
నిర్మాత అరుణ్ చంద్ర మాట్లాడుతూ ‘‘మా బీవీసీ బ్యానర్‌లో రూపొందుతోన్న తొలి చిత్రం ‘అరె ఒ సాంబ’. మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతుండటం  చాలా సంతోషంగా ఉంది. మా డైరెక్ట‌ర్‌గారు క‌థ చెప్ప‌గానే న‌చ్చేసింది. నా సోద‌రులు క‌రుణ్, న‌రేశ్‌గారితో క‌లిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం. త‌ప్ప‌కుండా మీ అంద‌రి స‌హాయ స‌హ‌కారాలు మాకు ఉంటాయ‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.
డైరెక్టర్ గోపి కాకర్ల మాట్లాడుతూ ‘‘నేను ఇది వరకు డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో వ‌ర్క్ చేశాను. క‌రోనా కార‌ణంగా, మా ప్రాజెక్ట్స్ సెట్స్‌పైకి రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. క‌థ‌పై న‌మ్మ‌కంతో సినిమా ప్రొడ్యూస్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన మా నిర్మాత‌లు అరుణ్ చంద్ర‌, న‌రేశ్ మ‌ల్లారెడ్డిగారికి హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఫ్యామిలీ, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్, కొంచెం హార‌ర్‌ ఎలిమెంట్స్ సినిమాలో ప్ర‌ధానంగా ఉంటాయి.

కిషోర్ రాయుడుగారు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అలాగే ప్ర‌మోద్‌గారు  మ్యూజిక్ చేస్తున్నారు. ఇప్ప‌టికే పాట‌లు రెడీ చేసుకున్నాం. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.
బ్యానర్:  బి.వి.సి
న‌టీన‌టులు: అనీల్‌, కియా, అమిత్ తివారి, స‌తీశ్ సిరిప‌ల్లి, ధ‌న‌ల‌క్ష్మి, న‌వీన్‌, క‌ర‌ణ్ విజ‌య్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  గోపి కాక‌ర్ల‌
నిర్మాత‌:  అరుణ్ చంద్ర‌
స‌హ నిర్మాత‌:  శ్రీ న‌రేశ్ మ‌ల్లారెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ:  కిషోర్ రాయుడు
మ్యూజిక్‌:  క‌ర‌ణం ప్ర‌మోద్ కుమార్‌
ఎడిట‌ర్‌:  డి.వెంక‌ట ప్ర‌భు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *