APA Digital Stars Awards 2022
సందడిగా అపా డిజిటల్ స్టార్ అవార్డ్స్ 2022 ఎవర్ గ్రీన్ గా సోషల్ మీడియా మాధ్యమాలు : హాస్య నటుడు అలీ
శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో జరిగిన అపా డిజిటల్ స్టార్ అవార్డ్స్ 2022 ను టాలీవుడ్ హాస్య నటుడు అలీ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. అలీతో పాటు అతిధులు ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే, నటుడు వి.జే సన్నీ, మానస్ నాగులపల్లి, నటి లహరి షహరీ, ప్రముఖ ఆర్.జే కాజోల్, హాస్య నటుడు అలీ సతీమణి జుబేదా సుల్తానా బేగం, యాంకర్ శివా, గీతా భగత్, బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ లు ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జ్యోతి ప్రజల్వ చేసి ఆరభించారు.
ఈ సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లకు చెందిన 50 మంది ఇన్ ప్లూయెన్సర్లకు అవార్డులను ప్రధానం చేశారు.
అనంతరం అలీ మాట్లాడుతూ మీడియా మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాకు ఎంతో క్రేజ్ పెరిగిందన్నారు. ఎంటరైటైన్ మెంట్, కామెడీ, టాలెంట్ వంటి వివిధ రంగాల్లో స్టోరీ మేకింగ్ ఇలా..ఎన్నో విషయాల్లో ఇప్పుడు యు ట్యూబ్, ఇస్టా ప్లాట్ ఫామ్స్ ల్లో నేటి యువత స్టార్స్ గా ఎగదుగజమే కాదు..స్వయం ఉపాధి కూడా పొందుతున్నారన్నారు. ఎమ్మెల్సీ రవీందర్, వి.జే సన్నీ, రఘు కుంచే, లహరీలు మాట్లాడుతూ ఒక్కోరు ఒక్కో తమదైన శైలిలో యూ ట్యూబ్, ఇస్టాలో అభిమానాన్ని చూరగొంటున్న ఈ స్టార్స్ ను మరింత ప్రోత్సాహం అందించేందుకు శ్రీని ఇన్ ఫ్రా మొదటి సారిగా అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.
అపా డిజిటల్ స్టార్ అవార్డ్స్ నిర్వహకులు, శ్రీని ఇన్ ఫ్రా యం.డి జి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా..నెటీ జన్ల అభిమానానాన్ని చూరగొంటున్న యూ ట్యూబ్, ఇస్టా ఇన్ ప్లూయెన్సర్లకు వివిధ క్యాటగిరిలో వారికి ఉన్న ఫాలోవర్స్ బట్టి అవార్డులకు ఎంపిక చేశామన్నారు. త్వరలో విశాఖపట్నంలో అపా డిజిటల్ స్టార్ అవార్డ్స్ రెండవ ఎండిషన్ కూడా నిర్వహించనున్నామని తెలిపారు.