మ‌హేశ్ కూల్ లుక్‌

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారితో క‌లిసి అల్ల‌రి చేస్తున్నాడు. పిల్ల‌ల‌తో మ‌హేశ్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోల‌ను న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మ‌హేశ్, గౌత‌మ్‌, సితార‌ల‌తో ఉన్న లేటెస్ట్ ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. చాలా కూల్ లుక్‌లో మ‌హేశ్ చాలా యంగ్‌గా క‌న‌ప‌డుతున్నాడు. మ‌హేశ్ లుక్ చాలా బావుంద‌ని అంద‌రూ అంటున్నారు. టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ బ్ర‌హ్మాజీ ‘‘బాగా మగ్గిన బంగినపల్లిలా రోజు రోజుకీ మెరిసిపోతున్నాడు మా కృష్ణ‌గారి అబ్బాయి’’ అంటూ మెసేజ్ చేశాడు.