*పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ టైటిల్ ‘హరిహర వీరమల్లు’ *ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదల* రూ. 150 కోట్లతో మెగా సూర్యా ప్రొడక్షన్ గ్రాండియర్‌గా నిర్మిస్తోన్న చిత్రం *2022 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్‌కు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ఖరారు చేశారు. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ఎ.ఎం. రత్నం ఈ ఎపిక్ చిత్రానికి సమర్పకులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ లుక్ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. ఆ లుక్‌నుచూడగానే అద్భుతంగా అనిపిస్తోంది. ‘ హరి హర వీరమల్లు’ గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ తొలి దృశ్యమాలికలో పవన్ లుక్ పూర్తిగా కొత్తదనంతో కనిపిస్తోంది. పై నుంచి కింద దాకా ఆయన రూపం పూర్తిగా మారిపోయిందని స్పష్టంగా గమనించవచ్చు. ఇది మనం గతంలో ఎన్నడూ చూడని పవన్ కల్యాణ్ రూపం. డైరెక్టర్ క్రిష్అద్భుతమైన విజన్‌కు తగ్గట్లు కీరవాణి టెర్రఫిక్ మ్యూజిక్, గ్రాండియర్ విజువల్స్‌తో ఈ ఫస్ట్ గ్లిమ్స్ అపూర్వం గాఉంది. “ఇది ఒక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ.” అని డైరెక్టర్ క్రిష్ చెప్పారు. నేటి తరం దర్శకుల్లో ఒకఇంద్రజాలికుడు లాంటి ఆయన తన ట్రేడ్‌మార్క్ అంశాలతో ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నారు.
Read more