దొంగలున్నారు జాగ్రత్త’ యూనిక్ మూవీ.. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదు: ప్రీతి అస్రాణి ఇంటర్వ్యూ డి. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. ప్రీతి అస్రాణి కథానాయిక. సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ప్రీతి అస్రాణి విలేఖరుల సమావేశంలో ఈ సినిమా విశేషాలని పంచుకున్నారు. మళ్ళీరావా సినిమా తర్వాత మీ ప్రయాణం ఎలా వుంది ? మళ్ళీరావా తర్వాత ప్రెజర్ కుక్కర్, ఆడ్ ఇన్ఫినిటమ్, సీటిమార్ చిత్రాలు చేశాను. ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’లో ఒక ఛాలెంజ్ తో కూడిన పాత్ర చేస్తున్నాను. ‘దొంగలున్నారు జాగ్రత్త’లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ? ‘దొంగలున్నారు జాగ్రత్త’ చాలా యూనిక్ కథ. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ కూడా వుంది. ఇందులో నీరజ పాత్రలో కనిపిస్తాను. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయి వుంటాయి. ప్రతి ఒక మహిళా ఆ పాత్రకు కనెక్ట్ అవ్వగలుగుతారు.ఎందుకంటే ఇందులో మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే నేచురల్ విజువల్స్ వుంటాయి. నా పాత్ర నిడివి తక్కువగా వున్నప్పటికీ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే పాత్ర నీరజ. దర్శకుడు సతీష్ నీరజ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. నటనకు ఆస్కారం వుండే పాత్రది. నీరజ పాత్ర చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా రాబరీ జోనర్ లో ఉంటుందా ? రాబరీ నేపధ్యం కాదు. చాలా యూనిక్ కాన్సెప్ట్. మీరు ఊహించని మలుపు వుంటాయి. సినిమా చూసిన తర్వాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ టైటిల్ ఎందుకు పెట్టామో మీకే తెలిసిపోతుంది. నీజ పాత్రకి మీకు ఎలాంటి పోలికలు ఉన్నాయా ? నీరజ ప్రపంచానికి నాకు ఒక పోలిక వుంది. మేము ఇద్దరం చాలా స్ట్రాంగ్. నీరజ ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదురుకుంటుంది. నాలో కూడా ఆ గుణం వుంది. అలాగే నీరజలో మొండితనం కూడా ఎక్కువే. నాలో కూడా కొంచెం మొండితనం వుంది (నవ్వుతూ) ‘దొంగలున్నారు జాగ్రత్త’ ప్రయాణం ఎలా సాగింది ? ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రం కోసం పని చేయడం గొప్ప ప్రయాణం. ఇంత మంచి టీం దొరకడం నా అదృష్టం. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ లో పని చేయడం ఆనందంగా వుంది. దర్శకుడు సతీష్ మంచి విజన్ వున్న దర్శకుడు. సీన్ ని చాలా వివరంగా చెప్తారు. టీంతో ఎంతో ఆప్యాయంగా వుంటారు. శ్రీసింహ గారితో పని చేయడంమంచి అనుభవం. చాలా కూల్ గా ఎంతో అణుకువగా వుంటారు. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే టెక్నికల్ టీం గ్రేట్ అవుట్ పుట్ ఇచ్చారు. సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి బ్రిలియంట్ నటులతో పని చేయడం కూడా గొప్ప అనుభవం. ఒకే లొకేషన్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? కథలో ఇన్వాల్ అవ్వడంతో ఆ ఒక్క లొకేషనే మా ప్రపంచమైపోయింది. ఒకే లొకేషన్, ఒకటే కాస్ట్యూమ్స్ చేస్తున్నామనే ఆలోచన కూడా వుండేది కాదు.ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఒక అద్బుతమైన ప్రపంచం సృష్టించారు. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాం. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు.. మీ నేపధ్యం ఏమిటి ? మాది గుజారాత్. ఐదేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. అంజు అస్రాని మా అక్క. ఆమె నుంచే నటన నేర్చుకున్నాను. ఆమె నాకు స్ఫూర్తి. సినిమాకి సబంధించిన అంశాలు అక్కతో చర్చిస్తుంటాను. తను నా గైడ్. నా కుటుంబం ఎంతో ప్రోత్సహిస్తుంది. పాత్రలు చేయడం పరిమితులు ఏమైనా ఉన్నాయా ?
Read more