దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ టీజర్ విడుదల

  దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న సినిమా ‘సీతా రామం’ టీజర్ విడుదల    స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో  అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నిమిషం 14 సెకన్ల నిడివిగల ‘సీతా రామం’  టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965 కశ్మీర్ మంచు కొండలని చూపిస్తూ .. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వాయిస్ తో మొదలైన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది. ”లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ ఈ వాయిస్ ని ఫాలో అవుతూ చూపించిన విజువల్స్, ఎమోషన్స్ మ్యాజికల్ గా వున్నాయి లెఫ్టినెంట్‌ రామ్‌ గా దుల్కర్ సల్మాన్ మెస్మరైజ్ చేశారు. తన గత సినిమాల కంటే ఇందులో మరింత హ్యాండసమ్ గా కనిపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. తనకు వచ్చిన ఉత్తరాలను చూసి ‘సీతా.. ఎవరు నువ్వు?’ అని దుల్కర్ అన్నవెంటనే నిండు సంప్రాదాయంగా సీత పాత్ర రివిల్ కావడం హను రాఘవపూడి లవ్లీ మార్క్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ ల కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. టీజర్ లో ప్రతి ఫ్రేమ్  లావిష్ గా వుంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది.  పీఎస్ వినోద్ కశ్మీర్ ని మరింత ఆహ్లాదంగా తన కెమరాతో బంధించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం హార్ట్ టచింగ్ గా వుంది. ప్రొడక్షన్ విలువలు అత్యున్నతంగా వున్నాయి. వండర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కథనం, అందమైన విజువల్స్, మ్యాజికల్ మ్యూజిక్ తో’ సీతా రామం’ ఒక ఎపిక్ లవ్ స్టోరీగా ఉండబోతోందని టీజర్ భరోసా ఇస్తుంది. ”సీతా రామం” తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతుంది. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘సీతా రామం’ టీజర్ కి వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకంటే వండర్ ఫుల్ గా సినిమా వుండబోతుంది.  ‘సీతా రామం’ మెమరబుల్ మూవీ. అద్భుతమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. దేశంలో చాలా ప్రదేశాలు చూసే అవకాశం దక్కింది, దర్శకుడు హను రాఘవపూడి, స్వప్న గారి సపోర్ట్ కి కృతజ్ఞతలు. విశాల్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు.  సీతా రామం’ కథ గొప్పగా వుంటుంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుంది” అన్నారు దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది.  ప్రేక్షకుల కి వండర్ ఫుల్ ఎక్సపిరియన్స్ ఇవ్వడానికే వందల మంది రెండేళ్ళుగా కష్టపడ్డాం. దుల్కర్ సల్మాన్  ని లెఫ్ట్నెంట్ రామ్ పాత్రలో ఇంకా ఇష్టపడతారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ప్రయాణం లో సపోర్ట్ గా నిలిచిన దుల్కర్ , నిర్మాత స్వప్న గారికి థాంక్స్. చాలా వైవిధ్యమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరీంచాం. మైనస్ 24 డిగ్రీల వద్ద కూడా షూట్ చేశాం, ఇది దుల్కర్, స్వప్న  గారి సపోర్ట్ వలెనే సాధ్యపడింది” అన్నారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం చాలా అద్భుతమైన టీమ్ పని చేసింది. ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది. దుల్కర్, స్వప్న, హను గారితో పని చేయడం ఆనందంగా వుంది” అన్నారు. ఈ సందర్భంగా మీడియా, అభిమానులు అడిగిన ప్రశ్నల కి సీతారామం యూనిట్ సమాధానాలు ఇచ్చారు. మహానటితో ఒక మార్క్ సెట్ చేశారు. సీతారామంతో ఒక నటుడిగా ఎలాంటి మార్కులు పడతాయని భావిస్తున్నారు ?

Read more

Seetharamapuram lo Oka Prema Janta Movie Teaser launch

  సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట టీజ‌ర్ లాంచ్‌ శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాకంపై ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `సీతారామ‌పురంలో

Read more

లావణ్య త్రిపాఠి హ్యాపీ 340

లావణ్య త్రిపాఠి హ్యాపీ 340   మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం

Read more

Director Apsar Interview

  నిజానికి ద‌గ్గ‌ర‌గా అంద‌రూ మెచ్చుకొనేలా గంధ‌ర్వ చిత్రం వుంటుంది – ద‌ర్శ‌కుడు అప్స‌ర్ ఇంట‌ర్వ్యూ’ అతిశ‌యోక్తులు, ప‌గలు ప్ర‌తీకారాలు వంటివి లేకుండా నిజానికి ద‌గ్గ‌ర‌గా స‌రికొత్త

Read more

Hero Prateek Prem interview

    ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు చ‌క్క‌టి ఫీల్‌గుడ్ క‌లిగించే చిత్రమే `సదా నన్ను నడిపే` – హీరో ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్‌ `వాన‌విల్లు` చిత్రం త‌ర్వాత హీరో ప్రతీక్

Read more