Macherla Niyojakavargam ‘Macherla Action Dhamki’ Released
Nithiin, Sreshth Movies’ Macherla Niyojakavargam ‘Macherla Action Dhamki’ Released Macherla Niyojakavargam starring the versatile star Nithiin is carrying exceptional
Read moreNithiin, Sreshth Movies’ Macherla Niyojakavargam ‘Macherla Action Dhamki’ Released Macherla Niyojakavargam starring the versatile star Nithiin is carrying exceptional
Read moreమైండ్ బ్లో అయ్యే కేరక్టర్లో దీపిక పదుకోన్: సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహామ్ నటిస్తున్న పఠాన్ సినిమాకు సంబంధించి ప్రతి సూక్ష్మమైన
Read moreమెగాస్టార్ చిరంజీవి సమక్షంలో కైకాల జన్మదిన వేడుకలు హర్షం వ్యక్తం చేసిన కైకాల కుటుంబ సభ్యులు నవరస నటన సర్వము కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా
Read moreదుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతా రామం’ తెలుగు ట్రైలర్ గ్రాండ్ గా విడుదల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మ సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘సీతారామం’ థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ‘సీతారామం’ ఎపిక్ లవ్ స్టొరీలోని కీలకమైన ఘట్టాలని ఆసక్తికరంగా ఆవిష్కరించింది.“ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్‌నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’ అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రామ్ ఒక ఒక అనాథ. కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గా భాద్యతలు నిర్వహిస్తుంటాడు. సీత అనే అమ్మాయి నుండి వచ్చిన ఉత్తరం రామ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రామ్, సీతను కలుస్తాడు. వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. రామ్ కాశ్మీర్ లోని తన క్యాంపు కి తిరిగి వచ్చినప్పుడు సీతకు ఒక లేఖ రాస్తాడు. కానీ అది ఆమెకు చేరలేదు. 20 ఏళ్ల తర్వాత సీతకు ఆ లేఖ ఇచ్చే భాద్యత రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్ ల పై పడుతుంది. సీత అన్వేషణ లో విఫలమైన వారు.. రామ్ కోసం అన్వేషణ మొదలుపెడతారు. కానీ రామ్ ని పట్టుకోవడం సీతని అన్వేషించడం కంటే కష్టమౌతుంది. దీనికి కారణం రామ్ బాస్ బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్). ట్రైలర్ లో ఆవిష్కరించిన ఈ సన్నివేశాలు సినిమాపై మరింత క్యురీయాసిటీని పెంచాయి. 1965, 80 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా సాగింది. అత్యున్నత నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం చిరకాలం నిలిచిపోయే చిత్రంగా అవుతుంది అని ట్రైలర్ చూస్తేఅర్ధమౌతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు,. ఇందులో వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. రష్మిక మందన్న హీరోయిక్ రోల్, సుమంత్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా వుంది. అందమైన ప్రేమకథలు రూపొందించడంలో హను రాఘవపూడి మరోసారి తన ప్రత్యేకతని నిరూపించుకున్నారు. సీత, రామ్ ల ప్రేమకథని చాలా అందంగా, హృద్యంగా చూపించారు. “నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే – కాశ్మీర్ ని మంచుకొదిలేసి వస్తారా?“ అనే డైలాగ్ ఈ ప్రేమ కథ ఎంత అందంగా వుంటుందో చెప్పకనే చెప్పింది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ గా వుంది. ట్రైలర్ కి విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన రీ-రికార్డింగ్ గ్రాండ్ గా ఉంది. ఎమోషన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసింది. రెండు విభిన్న కాలాల కథను సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడంలో మాస్టర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన మార్క్ ని చూపించారు. వైజయంతీ మూవీస్ , స్వప్న సినిమా గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ అత్యద్భుతంగావుంది. విజువల్స్ గొప్ప ఆర్టిస్ట్ చిత్రీకరించిన పెయింటింగ్స్ లా ఉన్నాయి. ఆగస్ట్ 5న సీతారామం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అందరూ రొమాంటిక్ హీరో అని పిలవడంతో విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిలో వదులకూడదనిపించింది. చివరి ప్రేమకథగా సీతారామం లాంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని నిర్ణయించుకున్నా. సీతారామం షూటింగ్ అద్భుతమైన అనుభవం. దేశంలోని అనేక ప్రదేశాలలో షూట్ చేశాం. అన్ని ప్రదేశాలు నేను ఎప్పుడూ చూడలేదు. కథని బలంగా నమ్మాము. అందరం వంద శాతం బెస్ట్ వర్క్ ఇచ్చాం. అశ్వినీదత్ గారి లాంటి సినిమా పై ప్యాషన్ వున్న నిర్మాతతో ఇప్పటివరకూ పని చేయలేదు. అన్ని అవసరాలని సమకూర్చారు. ఎంతో అప్యాయంగా భోజనం పెట్టెవారు. హను గారు సినిమా పై గ్రేట్ ప్యాసన్ వున్న రచయిత, దర్శకుడు. ఆయనకి సినిమా తప్పితే మరో ద్యాస లేదు. సీతగా మృణాల్ అద్భుతంగా చేసింది. రష్మిక పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది. గ్రేట్ టీమ్ తో పనిచేశాననే ఆనందం వుంది. సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ వుంది. సీతారామం లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ఆగస్ట్ 5న అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు. హను రాఘవపూడి మాట్లాడుతూ.. సీతారామం సినిమా బాగా వర్షం వచ్చినపుడు వేడి కాఫీ తాగినట్లు వుంటుంది. ఎండాకాలంలో చల్లటి నీరు తాగినట్లు వుంటుంది. ఆగస్ట్ 5 ఈ సినిమా చూస్తున్నపుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఇది రాసివ్వగలను. ఈ సినిమా మీతో పాటు వచ్చేస్తుంది. చిరకాలం గుర్తిండిపోతుంది. కథ ,పాత్రలు మాత్రమే వుంటాయి.మిమ్మల్ని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇలానే ప్రదేశాలకు తీసుకెల్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దుల్కర్ , సుమంత్, మృణాల్, రష్మిక కి స్పెషల్ థాంక్స్. వీరి సపోర్ట్ లేకపొతే సినిమాలో ఒక్క పేజీ కూడా నిండేది కాదు. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులని దాటి ఈ రోజు సినిమా ట్రైలర్ చూసే పరిస్థితి వచ్చిందంటే తెరవెనుక వందలమంది కష్టం వుంది. సీతారామం మీ అందరికీ గొప్ప అనుభూతిని ఇస్తుంది” అన్నారు. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. దర్శకుడు హను గారు జీనియస్. ఈ కథని చెప్పినపుడు సీత, రామ్ ల ప్రేమలో పడిపోయా. నిర్మాత అశ్వినీదత్ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. సెట్ లో ప్రతిరోజు ఒక అందమైన కలలా వుండేది. సీత పాత్ర అద్భుతంగా వుంటుంది. ఆ పాత్రలో రోమాన్స్ కూడా వుంది. ఈ మధ్య కాలంలో రోమాన్స్ సినిమాలు తగ్గిపోతున్నాయి. సీతారామంలో మ్యాజికల్ రోమాన్స్ వుంటుంది. దుల్కర్, సుమంత్, రష్మిక కు థాంక్స్. ఆగస్ట్ 5న అందరం థియేటర్ లో కలుద్దాం’ అన్నారు. రష్మిక మాట్లాడుతూ.. అఫ్రిన్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ ఇచ్చారు.. ఈ పాత్రకు ఎలా న్యాయం చేయాలని దర్శకుడు హను గారిని అడిగాను. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ నా పాత్రకు న్యాయం చేశానని పిస్తుంది. ఒక అందమైన ప్రేమ కథ చెప్పాడానికి కథకుడు వుండాలి. కథ ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి కదా.. ఇందులో ఆ వివరాలని నేను ఇస్తా. సీత రామ్ అందమైన ప్రేమ కథని అఫ్రిన్ చెప్పే విధానం మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆగస్ట్ 5కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.
Read moreఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు … ఈ రోజు జులై 25న హీరో నారా రోహిత్ జన్మదినం సందర్భంగా బంధు మిత్రులతో
Read moreమెగాస్టార్ చిరంజీవి గారు అవకాశం ఇస్తే తెలుగులో నటిస్తా..బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్,
Read more‘రామారావు ఆన్ డ్యూటీ’ నాకు చాలా డిఫరెంట్ మూవీ: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ
Read moreరామారావు ఆన్ డ్యూటీ’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది, ఆలోచింపచేస్తుంది: రజిషా విజయన్ ఇంటర్వ్యూ మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
Read moreమెగాస్టార్ చిరంజీవి గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ‘లాల్ సింగ్ చెడ్డా’ నుంచి నాగ చైతన్య లుక్ విడుదల మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
Read moreది గ్రే మాన్’ ప్రెస్ మీట్ లో ఇండియా, ధనుష్ పై తమ అభిమానం పంచుకున్న రూసో బ్రదర్స్!! హాలివుడ్ యాక్షన్ దర్శకులు రూసో బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్
Read more