Director Sarath Mandava Interview

  రామారావు ఆన్ డ్యూటీ’ లార్జర్ దెన్ లైఫ్ యూనిక్ థ్రిల్లర్ : శరత్ మండవ ఇంటర్వ్యూ   మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమౌతున్న నేపధ్యంలో దర్శకుడు శరత్ మండవ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్ర విశేషాలివి. రవితేజ ఏం డ్యూటీ చేయబోతున్నారు ? ‘రామారావు ఆన్ డ్యూటీ’ రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ ఇన్వెస్ట్ గేటివ్ థ్రిల్లర్. ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు, లేదా క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్ గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఇందులో చాలా యునిక్ పాయింట్. కథలో ఇసుక మాఫియా కీలకంగా ఉంటుందా ? ప్రత్యేకంగా ఇసుక మాఫియా అని లేదు. కలెక్టరేట్ తో ముడిపడిన విభాగాలన్నీటికీ చాలా వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలు వుంటాయి. కోర్టులు పని చేయనప్పుడు కలెక్టరేట్ కు ఆదేశాలు ఇచ్చే హక్కు వుంటుంది. కథలో ఆ సీన్ కి సంబధించిన అంశం వచ్చినపుడు దాని గురించి కొంత చెప్పడం వుంటుంది. రామారావు ఆన్ డ్యూటీ కథ ఎప్పటినుండి మీ ఆలోచనలో వుంది ? కథలు ఎప్పుడూ మనసులో తిరుగుతూనే వుంటాయి. కొన్ని పరిణితి చెందుతుంటాయి. ఏదో ఒక హుక్ పాయింట్ దొరికినప్పుడు పూర్తిగా రాసేస్తాం. ఇది కూడా నాలుగేళ్ల క్రితం నుండి వున్న ఆలోచన. రవితేజ గారు కథ లోకి వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ కి తగ్గకొన్ని మార్పులు చేయడం జరిగింది. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఎక్కువగా వుంది. కానీ రవితేజ గారు అంటే ఆడియన్స్ ఎంటర్ టైన్మెంట్ అని ఆశిస్తారు.. ఇందులో అది ఎంత శాతంలో వుంటుంది ? ఎంటర్ టైన్మెంట్ అంటే కామెడీ అని నేను అనుకోవడం లేదు. ఆడియన్స్ ని యంగేజ్ చేయడమే ఎంటర్ టైన్మెంట్. ఇందులో ఫన్ ఫ్యాక్టర్ కూడా వుంటుంది. రవితేజ సినిమా అంటే మాస్ ఎంటర్ టైన్మెంట్.  అందులో కూడా కొత్తదనం కోరుకుంటారు ఆడియన్స్. రామారావు ఆన్ డ్యూటీ లో వున్న కొత్తదనం ఏమిటి? కథ చాలా యునిక్ గా వుంటుంది. పాత్ బ్రేకింగ్ కథ అని చెప్పను కానీ చాలా డిఫరెంట్ గా వుంటుదని మాత్రం చెప్పగలను. రవితేజ గారి గత సినిమాల ఛాయలని రిపీట్ కాకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. 2016 లో వచ్చిన మీ మొదటి సినిమా కేఓ 2 తర్వాత ఇంత విరామం రావడానికి కారణం ? కేఓ 2 తర్వాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే పెద్ద హీరోలకు ఎప్పుడూ ఒక లైనప్ వుంటుంది. ఆ లైన్ లో ఏదైనా డ్రాప్ అయితే మన సినిమా ముందుకు వస్తుంది. మధ్యలో విశాల్ గారితో ఒక ప్రాజెక్ట్ చర్చలు జరిగాయి. తర్వాత కరోనా వచ్చింది.   రామారావు ఆన్ డ్యూటీ కూడా చాలా రోజుల క్రితమే రవితేజ గారి చెప్పాను. ” రామారావు ఆన్ డ్యూటీ ” టైటిల్ గురించి చెప్పండి ?  రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీ గా ఆయన పేరు వచ్చింది.  తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ హీరో. అలాగే కేటీఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. ”రామారావు’ అనేది ఒక స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం. అందుకే ఈ పాత్రకు రామారావు

Read more