అర్చన చెప్పిన “అన్నపూర్ణమ్మ గారి మనవడు” సంగతులు

అర్చన చెప్పిన “అన్నపూర్ణమ్మ గారి మనవడు” సంగతులు
హేరోయిన్ అర్చన పేరు వినగానే “శ్రీరామదాసు” చిత్రం లోని సీత పాత్ర గుర్తుకి వస్తుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మించిన “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రంలోని తన నటన గుర్తుకి వస్తుంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు తమిళ చిత్రాలలో నటించి, ఈ మద్య బిగ్ బాస్ లో ఓ మెరుపు మెరిసిన అర్చన ఇప్పుడు ఎమ్మెన్నార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన పదహారణాల తెలుగు సినిమా “అన్నపూర్ణమ్మ గారి మనవడు”లో హీరోయిన్ గా చేస్తోంది. మిర్యాలగూడలో జరిగిన అమృత, ప్రణయ్ ల యదార్ధ గాధ ఆధారంగా నిర్మించ బడిన ఈ చిత్రంలో అమృత పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అర్చనతో జరిపిన సంభాషణ ఇప్పుడు చూద్దామా..“హాయ్ అర్చన గారు ఎలా ఉన్నారు?”“చాలా బావున్నాను”“అన్నపూర్ణమ్మ గారి మనవడు” చిత్రంలో నటిస్తున్నారట ?”“అవునండీ”“మీరు చేసే రోల్స్ ఆచి తూచి ఎన్నుకుంటారని విన్నాం. ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు?“ఈ మూవీకి  సీనియర్ డైరెక్టర్ నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు)  గారు దర్శకత్వం వహించటం, గతంలో ఆయన ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్స్ తో సినిమాలు చేయటం నాకు నచ్చి ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నాను.”“ఈ సినిమాలో మీ పాత్ర గురించి వివరిస్తారా ?”“ఈ సినిమాలో నేను అమృత పాత్ర పోషిస్తున్నాను. ఎన్నో భావోద్వేగాలతో కూడుకుని ఉన్న పాత్ర అది. కూతురిగా, ప్రియురాలిగా, ఇల్లాలిగా, చివరకు తల్లిగా ఎన్నో వేరియెషన్స్ చూపించాల్సిన సీరియస్ రోల్ నాకు ఇచ్చారు. నిజ జీవితం లోని ఆ పాత్ర లోకి నన్ను నేను పరకాయ ప్రవేశం చేసుకుని ఎంతో హుందాగా నటించాను. దర్శకులు శివనాగు గారు ఎప్పటికపుడు లొకేషన్స్ లో చక్కని సూచనలు నాలోని మాక్సిమమ్ నటనను రాబట్టుకున్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. మాయమవుతున్న మానవ సంబంధాల ఆవశ్యకతను ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించారు. అందమైన గ్రామీణ వాతావరణంలో కనులవిందు చేసే లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరించబడింది.  జమున గారు, అన్నపూర్ణ గారు, బెనర్జీ గారు లాంటి సీనియర్ నటీ నటులతో కలసి నటించటం చాలా సంతోషంగా అనిపించింది. నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరిగారు ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని భారీగా నిర్మించారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది, అద్భుత విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను”“అన్నపూర్ణమ్మ గారి మనవడు” సినిమా ప్రేక్షకులకు చేరేది ఎప్పుడు ?”“ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ వల్ల విడుదల ఆగిపోయింది. మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవగానే ఈ సినిమా విడుదల అవుతుంది”“థాంక్యూ అర్చన గారూ”ఇవండీ “అన్నపూర్ణమ్మ గారి మనవడు” గురించి హీరోయిన్ అర్చన చెప్పిన సంగతులు. వింటూంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూసేద్దామా అనిపిస్తోంది కదూ. థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు ఆగాల్సిందే మరి.