రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ మే 28 విడుదల
రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ మే 28 విడుదల
‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, ‘రాక్షసుడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ మే 28న విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
హవీష్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
శనివారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించారు. మే 28న చిత్రం విడుదలవుతోందని వెల్లడిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రస్‌లో, బ్లాక్ గాగుల్స్, బ్లాక్ షూస్‌తో, చేతిలో రివాల్వర్‌తో రోడ్డు మీద నడచుకుంటూ వస్తున్న రవితేజ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ ఉన్నాయి.
ఇంతకుముందు రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న విడుదల చేసిన వీడియో గ్లిమ్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యాక్షన్ లవర్స్‌కు మంచి ట్రీట్ కానున్నదని ఈ గ్లిమ్స్ ద్వారా తెలిపారు మేకర్స్.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.
ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో రమేష్ వర్మ ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ కానున్నది. సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
రవితేజ, మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్లు: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతీలాల్ గడ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
స్క్రిప్ట్ కో ఆర్డినేషన్: పాత్రికేయ
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సాగర్
ఎడిటింగ్: అమర్ రెడ్డి
ఆర్ట్: గాంధీ నడికుడికర్
పాటలు: శ్రీమణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి