ట్రెండింగో” సాంగ్ కు ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు..నిర్మాత శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ టి.విజయలక్ష్మి

ట్రెండింగో” సాంగ్ కు ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు..నిర్మాత శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ టి.విజయలక్ష్మి

విడుదలైన అతితక్కువ సమయంలోనే 1. మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ రికార్డ్ సృష్టిస్తున్న “ట్రెండింగో ” సాంగ్

శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ టి.విజయలక్ష్మి నిర్మాణంలో నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె. సంగీతం లిరిక్స్, కాన్సెప్ట్ లో నేటి ట్రెండ్ కు తగ్గట్టు చేసిన “ట్రెండింగో” పాటకు కె.వి.కె. దర్శకత్వం వహించారు. ఈ పాటను గత వారం సీనియర్ హీరోయిన్ లయ, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, లిరిసిస్ట్ చంద్ర బోస్, తదితరులు గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే!!.అయితే అమెరికా లోని డాలస్ నగరంలో ఫన్ ఎలిమెంట్ తో షూట్ చేసిన ఈ “ట్రెండింగో” సాంగ్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 1. మిలియ‌న్స్ వ్యూస్ తో దూసుకుపోతూ సంగీత ప్రియుల నుండి విశేష‌మైన ఆద‌ర‌ణ పొందడం విశేషం .ఈ పాటకు
వ‌స్తోన్న హ్యూజ్ రెస్పాన్స్‌తో నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, నిర్మాత .శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ టి.విజయలక్ష్మి అండ్ టీమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఈ సందర్బంగా …నిర్మాత టి. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ట్రెండింగో.. ట్రెండింగో అంటూ సాగే ఈ సాంగ్ చాలా క్లాసీ గా ఇంట్రెస్ట్ గా ఉంది. నటుడు,సంగీత దర్శకుడు అయిన రఘు కుంచె గారి డ్యాన్స్ చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది.ఈ పాటకు తనే సంగీతం, లిరిక్స్, కాన్సెప్ట్, డ్యాన్స్ చేస్తూ ఈ పాటకు సింగర్ గా తనే చ‌క్క‌గా ఆలపించారు.ఈ పాటకు సందీప్ నాయర్, చరణ్ & కె. వి. కె లు అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డి ఓ పి ఉదయ్ వంశీ చక్కటి విజువల్స్ ఇచ్చాడు. ఈ సాంగ్ విడుదలైన అతి తక్కువ సమయం లోనే ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *