యంగ్ హీరో రాజ్ తరుణ్‌ చేతుల మీదుగా ‘నటరత్నాలు’ మోషన్ పోస్టర్ విడుదల

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ చేతుల మీదుగా ‘నటరత్నాలు’ మోషన్ పోస్టర్ విడుదల

కామెడీ ప్రధానంగా తీసే సినిమాలకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏ సినిమా తీసినా కూడా కామెడీ ట్రాక్ ఉండేలా చూసుకుంటారు మేకర్లు. కామెడీ అనేది ఎవర్ గ్రీన్ జానర్. కామెడీ, క్రైమ్, మర్డర్ మిస్టరీ జోనర్లో ఒక డిఫరెంట్ కథతో ‘నటరత్నాలు ‘ అనే సినిమా రాబోతోంది. ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై చందన ప్రొడక్షన్స్ సమర్పణలో డా. దివ్య నిర్మాత గా, ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాత గా, యలమాటి చంటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత గా వ్యవహరించిన ఈ సినిమాకు నర్రా శివనాగు దర్శకత్వం వహించారు.

సుదర్శన్, ఇనయ సుల్తానా, రంగస్థలం మహేష్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ నటరత్నాలు సినిమా మోషన్ పోస్టర్‌ను యంగ్ హీరో రాజ్ తరుణ్ విడుదల చేశారు. అనంతరం రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. మోషన్ పోస్టర్ చూస్తే ఎంతో సరదాగా అనిపిస్తుందని, ఇది కంటెంట్ ఉన్న కొత్త జోనర్ అని, సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని, దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ముఖ్య పాత్రలో నటిస్తున్న దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ నర్రా శివనాగు నాకు ఎప్పటి నుంచో మిత్రుడు. నేను సాగర్ వద్ద, శివనాగు ఆర్జీవీ వద్ద అసిస్టెంట్లుగా చేశాం. శివ వన్ మెన్ ఆర్మీ. శివ కోసం నేను కూడా ఈ సినిమాలో నటించాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. మా నిర్మాతలు దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఈ సినిమాకు శంకర్ మహదేవ్ (రాజ్ కిరణ్‌) సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో టైగర్ శేషాద్రి నాయుడు ప్రతి నాయక పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి మరో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలన్నీ కూడా త్వరలోనే మేకర్లు ప్రకటించనున్నారు.

నటీనటులు : సుదర్శన్, ఇనయ సుల్తానా, రంగస్థలం మహేష్‌, ఏ ఎస్ రవికుమార్ చౌదరి, టైగర్ శేషాద్రి నాయుడు తదితరులు

సాంకేతికబృందం

బ్యానర్ : ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : డా. దివ్య
సహ నిర్మాత : ఆనందాసు శ్రీ మణికంఠ
సమర్పణ : చందన ప్రొడక్షన్స్
దర్శకుడు : నర్రా శివనాగు
సంగీత దర్శకుడు : శంకర్ మహదేవ్ (రాజ్ కిరణ్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *