నా “కెరీర్ పుస్తకం”లో మరో కొత్త అధ్యాయం!!

నా “కెరీర్ పుస్తకం”లో
మరో కొత్త అధ్యాయం!!

– ఇకపై నటనపైనే దృష్టి

– పాలిటిక్స్ జస్ట్ పార్ట్ టైమ్!

– కె. దివ్యవాణి చౌదరి

సినిమా రంగంలో “బాపు బొమ్మ”గా… టివి రంగంలో “పుత్తడిబొమ్మ”గా సుప్రసిద్ధురాలైన దివ్యవాణి… రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మరోవైపు “పే బ్యాక్ టు సొసైటీ” అనే నినాదం స్పూర్తితో సమాజానికి తన వంతు సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు. అయితే ఇకపై రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సినిమా రంగంపై దృష్టి సారించాలని దృఢ నిశ్చయం తీసుకున్నానని చెబుతున్నారు!

“పెళ్ళి పుస్తకం, ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్ళాం” వంటి చిరస్మరణీయ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థానం సంపాదించుకున్న దివ్యవాణి… “పుత్తడి బొమ్మ” టివి సీరియల్ తోనూ ఉర్రూతలూగించారు. అంతేకాదు… కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి… అక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ అందాల భామ… కన్నడ అనర్గళంగా మాట్లాడతారు. ఈ పాన్ ఇండియా యుగంలో.. రెండు మూడు భాషల్లో పాపులారిటీ కలిగిన ఆర్టిస్టులకు దర్శకనిర్మాతలు పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో… దివ్యవాణి మళ్లీ త్వరలోనే బిజీ ఆర్టిస్ట్ అవ్వడం తధ్యం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *