ఫిబ్రవరి 5 న ‘ది ఫాగ్’..

ఫిబ్రవరి 5 న ‘ది ఫాగ్’..

చుట్టూ తెల్లని ముసురు.. వరుసగా ముగ్గురి హత్యలు. ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎవరా హంతకుడు? ఇదంతా చేస్తుంది మనుషులా, పొగ వెనుక దాగిన దెయ్యమా?.. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలు హత్యకు గురైనవారి శరీరాలపై ఉండటం ఏమిటనే సన్నివేశంతో   కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో ట్రైలర్ లో చూయించారు. చివరిలో వేడి పుట్టించే ముద్దు సన్నివేశాలతో యూత్‌కు కావల్సిన అన్ని అంశాలతో వర్శి మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై  ‘ది ఫాగ్’..చిత్రాన్ని గోవర్ధన్ రెడ్డి నిర్మించారు.ఇంతకుముందు  విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో విరాట్‌చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుదన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఫిబ్రవరి 5 వ తేదీ న  విడుదల చేస్తున్నాము.ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ….ఇంతకుముందు మేము విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న మా సినిమా కు మంచి బిజినెస్ రావడంతో ఫిబ్రవరి 5 న ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాము.అలాగే త్వరలో తమిళ్ లో కూడా థియేట్రికల్ రిలీజ్ చేయ బోతున్నాము.ఇందులో నటించిన హీరోయిన్ చందన కొప్పిశెట్టి ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా ద్వారా  మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకొంది.తను రెండు,మూడు సినిమా షూటింగ్స్ లలో బిజీ ఉన్నా మేము అడిగిన వెంటనే మా సినిమాలో చెయ్యడానికి ఒప్పుకొని మా సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది అలాగే చిత్రం లో నటించిన టీం అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకు వస్తుందని అన్నారు.

నటీనటులు

విరాట్‌చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి, అజయ్  గోష్, నందు, సుప్రియ, ప్రణీత, ప్రమోద్

సాంకేతిక నిపుణులు

సినిమా టైటిల్ ..”ది ఫాగ్”
బ్యానర్…  వర్శి మోషన్ పిక్చర్స్
నిర్మాత….గోవర్ధన్ రెడ్డి
దర్శకత్వం.. సుదన్
కెమెరామెన్..హరినాథ్ సతీష్ రెడ్డి
మ్యూజిక్… విజయ్ కోరాకుల,విశ్వ
ఎడిటర్. సుదన్
పి.ఆర్.ఓ..మధు వి.ఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *