రావ‌ణ‌లంక టీజ‌ర్ విడుద‌ల‌

మంత్రి హ‌రీశ్ రావుగారు చేతులు మీదుగా రావ‌ణ‌లంక టీజ‌ర్ విడుద‌ల‌

కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మాత‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌ణలంక‌.  క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రావ‌ణ‌లంక ఆడియోకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇది ఇలా ఉండ‌గా నేడు మంత్రి హ‌రీశ్ రావుగారు రావ‌ణ‌లంక టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. పూర్తి క‌మ‌ర్షీయ‌ల్, ఎంట‌ర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజ‌ర్ ని రెడీ చేశారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కునే రీతిన రావ‌ణ‌లంకని తీర్చిదిద్దిన‌ట్లుగా ద‌ర్శ‌కుడు బి.ఎన్.ఎస్.రాజు తెలిపారు. ఫ్రిబ‌వ‌రిలో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత, హీరో క్రిష్ తెలిపారు.
 
టీజ‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ
 
హీరో క్రిష్ నాకు బాగా తెలుసు, రావణ లంక సినిమా గురించి మాట్లాడుతూ సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయని క్రిష్‌ చెప్పేవాడు, ఇప్పుడు చూస్తుంటే నిజం అనిపిస్తుంది. అతనికి మంచి భవిషత్తు ఉండాలని కోరుకుంటున్న అన్నారు. రేపు థియేటర్స్ లో కూడా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తుందని భావిస్తున్న అన్నారు.
న‌టీన‌ట‌లు – క్రిష్, అశ్మిత‌, త్రిష‌, ముర‌ళిశర్మ‌, దేవ్ గిల్ త‌దిత‌ర‌లు
 
బ్యాన‌ర్ – కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్ట‌రీ
నిర్మాత – క్రిష్ బండిపల్లి
మ్యూజిక్ – ఉజ్జ‌ల్
సినిమాటోగ్రఫి – హ‌జ‌ర‌త్ షేక్ (వ‌లి)
ఎడిటర్ – వినోద్ అద్వ‌య్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
కో డైరెక్ట‌ర్ – ప్ర‌సాద్
డైరెక్ట‌ర్ – బిఎన్ఎస్ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *