‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) సెప్టెంబర్ 9 విడుదల
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) కోసం అభిమానులు, సాధారణ ప్రేక్షకులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈరోజు ‘లైగర్’ తాజా షెడ్యూల్ మొదలైంది. అలాగే గురువారం ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించారు.
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘లైగర్’ సెప్టెంబర్ 9న విడుదలవుతోంది. రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ పోస్టర్లో చేతిలో బాణాకర్ర పట్టుకొని ఎగ్రెసివ్ మోడ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. ఎవరితోనో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు గట్టిగా అరుస్తున్నారు.
పోస్టర్‌ను గమనిస్తే, బ్యాగ్రౌండ్లో బాక్సింగ్ రింగ్‌లో ఎవరితోనో విజయ్ ఫైట్ చేస్తుండగా, ప్రేక్షకులు ఆసక్తిగా తిలకిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటివరకూ కనిపించని పూర్తి కొత్త లుక్‌లో విజయ్ కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు కూడా.
తన సినిమాల్లో హీరోలను స్టైలిష్‌గా, అదివరకు ఎప్పుడూ చూడని తరహాలో ప్రెజెంట్ చేసే పూరి జగన్నాథ్ ఇప్పుడు ‘లైగర్’లో మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో విజయ్ను చూపించబోతున్నారని రిలీజ్ డేట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ మన ముందుకు రానున్నదని పోస్టర్ తెలియజేస్తోంది.
విజయ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మాణమవుతోంది.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో సగం సింహం, సగం పులి బ్యాక్‌డ్రాప్‌లో బాక్సర్‌గా విజయ్ దేవరకొండ స్టిల్కు వచ్చిన రెస్పాన్స్ టెర్రిఫిక్.
బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, లావిష్‌గా ప్యాన్ ఇండియా లెవల్లో లైగర్‌ను పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్‌తో నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి విష్ణుశర్మ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
తారాగణం:
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, రమ్యకృష్ణ, రోణిత్ రాయ్, విషురెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను.
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
బేనర్స్: పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి
ఆర్ట్: జానీ షేక్ బాషా
పీఆర్వో: వంశీ-శేఖర్.