అమెజాన్ ప్రైమ్ లో హల్ చల్ చేస్తున్న “నటరత్నాలు

*అమెజాన్ ప్రైమ్ లో హల్ చల్ చేస్తున్న “నటరత్నాలు”.*

పిల్లలతో ఫ్యామిలీ మొత్తం సరదాగా చూసి ఎంజాయ్ చేసే చిత్రం “నటరత్నాలు”. ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్, అర్చన, సుమన్ శెట్టి చాలా బాగా నటించి మెప్పించారు.

ఇంతకుముందు థియేటర్స్ లో విడుదలై అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన “నటరత్నాలు” అమెజాన్ ప్రైమ్ లో ఇంటిల్లిపాదిని అలరిస్తూ మంచి టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. థ్రిల్లర్, క్రైమ్, కామెడీ జోనర్లో ఇంట్రెస్టింగ్ ని క్రియేట్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులకు మరింత చేరువైంది “నటరత్నాలు”.

ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి నర్రా శివనాగు దర్శకత్వం వహించారు. సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలోకి సెలబ్రిటీ అవ్వాలని ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ముగ్గురు యువకులు, ఒక యువతి, స్టార్ గా ఎదగడానికి చేసే ప్రయత్నంలో కథ ఎన్నో మలుపులు తిరుగుతూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో యమ స్పీడ్ గా సాగిపోతూ ఉంటుంది.

ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. చూసి ఆనందించండి.
రేటింగ్ 3.5/5.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *