దర్శకధీరుడు ఎస్‌.ఎస్. రాజమౌళి రిలీజ్‌చేసిన `గాలిసంప‌త్` ట్రైల‌ర్‌.

దర్శకధీరుడు ఎస్‌.ఎస్. రాజమౌళి రిలీజ్‌చేసిన `గాలిసంప‌త్` ట్రైల‌ర్‌.



బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా    రూపొందుతున్న చిత్రం గాలి సంప‌త్. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం.  అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న `గాలి సంప‌త్`  ట్రైలర్‌ను దర్శకధీరుడు ఎస్‌.ఎస్ రాజమౌళి విడుద‌ల చేసి టీమ్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా…

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “గాలి సంప‌త్.. ఫ‌న్‌, ఎమోష‌న్స్ మ‌రియు గ్రేట్ బాండింగ్స్ యొక్క కంప్లీట్ ప్యాకేజ్‌. రేపు మార్చి 11న థియేటర్లలో మీరు ఏం చూడ‌బోతున్నారు అనే దానికి చిన్న స్నీక్ పీక్ ఈ ట్రైల‌ర్‌. గాలి సంప‌త్ ట్రైల‌ర్‌ని విడుద‌ల‌చేసిన రాజ‌మౌళిస‌ర్‌కి ధ‌న్య‌వాదాలు. మా టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉంది“ అన్నారు.

హీరో శ్రీ‌విష్ణు మాట్లాడుతూ  – “గాలి సంప‌త్ నాకు ఒక స్పెష‌ల్ ఫిలిం. మా మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌చేసిన రాజ‌మౌళిగారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

`పిల్లలు త‌ప్పు చేస్తే త‌ల్లిదండ్రులు చాలా ఓపిగ్గా ప్రేమ‌గా క‌రెక్ట్ చేస్తారు..అదేంటో కాస్త మీసాలు వ‌చ్చేస‌రికి పెద్దొళ్లు ఏం చేసినా ఊరికే చిరాకులు వ‌చ్చేస్తాయి.. కోపాలు వ‌చ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపిగ్గా ప్రేమ‌గా అడ‌గాల్సింది సార్ అంటూ సాగే ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ కేవలం ‘ఫిఫీ’ అనే సౌండ్‌తోనే సంభాషణలు పలకడం విశేషం.  ప్ర‌తి అమ్మాయికీ డ‌బ్బున్నోడు కావాలి.. లేక‌పోతే ఫారినోడు  కావాలి. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు? అంటూ శ్రీ‌విష్ణు చెప్పె డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.  `ప్రపంచంలో ఏ తండ్రైనా తన కొడుకు తనకంటే నాలుగు మెట్లు ఎదగాలని చూస్తాడు. నువ్వేంటి నాన్న నన్ను తొక్కి…నువ్వు ఎద‌గాల‌ని చూస్తున్నావు అని శ్రీ విష్ణు చెప్పే డైలాగ్,  అలాగే  చివ‌ర‌లో  ‘ప్రకృతికి ఏం తెలుసు ఎవరు మంచోళ్లో, ఎవరో చెడ్డోళ్లో’ అని త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. అచ్చు రాజ‌మ‌ణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మొత్తంగా ఈ ట్రైల‌ర్ చూస్తుంటే వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది అని తెలుస్తోంది. మార్చి 11న  ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,
క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,
ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,
సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,
సంగీతం: అచ్చురాజ‌మ‌ణి,
ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,
మాట‌లు: మిర్చికిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి,
ఫైట్స్‌: న‌భ‌,
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను,
మేక‌ప్‌: ర‌ంజిత్‌,
క్యాస్ట్యూమ్స్‌: వాసు,
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌.
నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్,
నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,
స్క్రీన్ ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,
ద‌ర్శ‌క‌త్వం: అనీష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *